1964 లో బాబూ మూవీస్ పతాకంపై పునర్జన్మలో పూర్వజన్మ జ్ఞాపకాలతో అల్లబడిన ప్రేమకధ ఆధారంగా నిర్మించబడిన మరపురాని చిత్రం మూగమనసులు. అక్కినేని, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రంలో. దీనినే తరువాత మిలన్ (1967) అనే పేరుతో హిందీలో, మరల జానకి రాముడు (1988) గా తెలుగులోకి పునర్నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకులు. ఆచార్య ఆత్రేయ, ఆదుర్తి, మహదేవన్, ఘంటసాల, అక్కినేని ల అపూర్వ సమ్మేళనం ఈ చిత్రం. మనసును చించ గలిగినా, నిర్వచించ గలిగినా, గిలిగింతలు పెట్టించి చక్కిలిగిల కొట్టించినా, గుండెలు పిండే భావాన్ని దట్టించి మనను ఏడిపించ గలిగినా అది ఆత్రేయకే చెల్లును. అందుకే ఆయన మన మనసులతో ఆడుకునే మన'సు'కవి. పాట వ్రాయక నిర్మాతలను, వ్రాసి ప్రేక్షకులను ఏడిపించడం ఆత్రేయకు పరిపాటి. నిదురపోని పసి పాపలను "మా బంగారు తల్లివి కదమ్మా! బజ్జో" అని అంటాము. కలత చెంది నిదుర రాని మూగ మనసును పసి పాపలా నిదుర పొమ్మని, కునుకుతో మనసు కుదుట పడుతుందని అంటూ, స్నేహం జనన మరణాలకు అతీతమని వేదాంతిలా వివరిస్తూ, పాత్రకు తగిన యాసను తన పాటకు జోడించి, చక్కగా చెప్పారాయన. ఆ భావనకు 'మామ' మహదేవన్ కట్టిన మధురమైన బాణి, శోక భరిత స్పందనకు నాంది పలికిన మాస్టారి వాణి, ఎంతో రాణించి, ఈ పాటను చిరస్మరణీయం చేశాయి.
పల్లవి: | పాడుతా తీయగా సల్లగా | ||
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా.. | |||
పాడుతా తీయగా సల్లగా..ఆ..ఆ.. | |||
చరణం: | కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది | ||
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది | | కునుకు పడితె | | ||
కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు | | కలలె మనకు | | ||
ఆ కలిమి కూడ దోసుకునే దొరలు ఎందుకు | |||
పాడుతా తీయగా సల్లగా | |||
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా.. | |||
పాడుతా తీయగా సల్లగా..ఆ..ఆ.. | |||
చరణం: | గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు | ||
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు | | గుండె మంట | | ||
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు | | పోయినోళ్ళు | | ||
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు | |||
పాడుతా తీయగా సల్లగా | |||
పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా | |||
పాడుతా తీయగా సల్లగా | |||
చరణం: | మణిసిపోతె మాత్రమేమి మనసు ఉంటది | ||
మనసుతోటి మనసెపుడో కలసిపోతది | | మణిసి పోతె | | ||
సావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది | | సావు పుటక | | ||
జనమ జనమకది మరీ గట్టి పడతది | |||
పాడుతా తీయగా చల్లగా | |||
పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా.. | |||
పాడుతా తీయగా చల్లగా..ఆ..ఆ.. |
My sincere Thanks are to Sri B.Someswara Rao garu for the poster, Trinidad456 for loading the You Tube video and Wikipedia for the information about the actors.
*You can download this page as PDF file by clicking on the "Print Friendly" button below.
very sweet song
రిప్లయితొలగించండిSubbarao garu, thanks.
రిప్లయితొలగించండి