విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై 1965 లో నిర్మించిన చిత్రం చంద్రహాస. దీనిని తెలుగు, కన్నడ భాషలలో నిర్మించారు. చంద్రహాస చిత్రంలో తెలుగులో హరనాథ్, కన్నడలో రాజకుమార్ నటించారు. ఈ చిత్రానికి సాలూరు హనుమంతరావు గారు సంగీతం సమకూర్చారు. ఒకే ఒక పాటను ఘంటసాల మాస్టారు అలనాటి ప్రముఖ కన్నడ చిత్ర నేపధ్య గాయని బెంగుళూరు లత తో పాడారు. ఈమె ఇదివరలో నర్తనశాల చిత్రానికి బాలమురళీ కృష్ణ గారితో సలలిత రాగసుధారససారం పాడారు. ఇక్కడ మీరు విననున్న పాట 'ఇలకు దిగిన అందాల తారవో' చలనచిత్ర గీతాలలో బేహాగ్ రాగానికి మంచి గుర్తింపు. ఇదే రాగము, బాణిలో ఘంటసాలగారు, కన్నడంలో 'యావ కవియ శృంగార కల్పనెయో' అన్న పాటను రాజకుమార్ గారు అభినయించగా పాడినారు. ఆ దృశ్యాన్నే మీరు ఇక్కడచూస్తారు. అయితే ప్రస్తుతానికిది కన్నడ చిత్ర దృశ్యం పై తెలుగు డబ్ చేసిన వీడియో ఇది.
| చిత్రం: | చంద్రహాస (1965) | |
| రచన: | దాశరధి | |
| సంగీతం: | ఎస్.హనుమంత రావు | |
| గానం: | ఘంటసాల, బెంగుళూరు లత | |
| బెంగుళూరు లత: | ఆ..ఆ..ఆ..ఆ...ఓ..ఓ.ఆ..ఆ..ఆ. | |
| పల్లవి: | ఘంటసాల: | ఇలకు దిగిన అందాల తారవో..ఓ..ఓ.. సౌందర్య రాణివో.. |
| ఇలకు దిగిన అందాల తారవో..సౌందర్య రాణివో.. | ||
| పాల కడలిలో మధుర సుధారస ధారవో.. | ||
| ఇలకు దిగిన అందాల తారవో..ఓ..ఓ.. | ||
| చరణం: | బెంగుళూరు లత: | ఆ..ఆ..ఆ..ఆ.. |
| ఘంటసాల: | తేటి పెదవి తాకని నవ మల్లికవో.. | |
| మత్తు కొలుపు చల్లని తెలి వెన్నెలవో | ||
| మనసులోని తీయని తొలి కోరికవో ఓ..ఓ.. | ||
| మనసులోని తీయని తొలి కోరికవో | ||
| మరులు గొలుపు నా రామ చిలకవో .. | ||
| మరులు గొలుపు నా రామ చిలకవో | ||
| ఇలకు దిగిన అందాల తారవో..ఓ..ఓ.. | ||
| చరణం: | ఘంటసాల: | నాట్య మాడు బంగారు బొమ్మవో.. |
| బెంగుళూరు లత: | నిస గరి సనిదప | సప నిద పమగరి | సనిసపాప పమ|ప సాస నిరిసా | | |
| ఘంటసాల: | నడచి వచ్చు పగడాల కొమ్మవో. | |
| బెంగుళూరు లత: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | నాట్య మాడు బంగారు బొమ్మవో..నడచి వచ్చు పగడాల కొమ్మవో | |
| వాణి మీటు మాణిక్య వీణవో | ||
| తరులు పాడిన కళ్యాణ గీతివో.. | ||
| ఇలకు దిగిన అందాల తారవో..ఓ..ఓ.. |
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో పొందుపరచిన శ్రీ బోల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి, స్వర విశేషం అందించిన శ్రీ చంద్రమౌళి గారికి.








nartanaSaala lO "seelavatee nee gatee .." anna paaTa Bangalore Lata dE kaDaa?
ప్రత్యుత్తరంతొలగించుఅవునండీ. ధన్యవాదాలు.
ప్రత్యుత్తరంతొలగించు
ప్రత్యుత్తరంతొలగించుఘంటసాలవారి ఎన్నోపాటలు ప్రసిద్ధమైనవే.అందరూ వినేఉంటారు.కాని మాలాగ,ఎప్పుడూ వినని పాటలుకొన్ని(కన్నాంబ,సుందరమ్మ,వంటి గాయనీమణులతో పాడిన)అపురూపమైన పాటల్ని సేకరించి వినిపించినందుకు ధన్యవాదాలు.