లలితా ఫిలింస్ పతాకంపై టి.ప్రకాశరావు దర్శకత్వంలో ముగ్గురు అగ్ర నటులు (ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్.), ఇద్దరు అగ్ర నటీమణులు (సావిత్రి, అంజలీదేవి) నటించిన చిత్రం చరణదాసి (1956). అంతేకాకుండా చలన చిత్ర జీవితంలో ఎన్.టి.ఆర్. తొలిసారిగా శ్రీరాముని పాత్రలో కనిపించిన చిత్రమిది. ఈ చిత్రకథ కు మూలం నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసిన బంగాలీ నవల "నౌకా డూబీ" (ఆంగ్ల అనువాదం: The wreck). పడవ ప్రమాదంలో గల్లంతయి కొత్తగా పెళ్ళయిన ఇద్దరు జంటలో భార్యాభర్తలు తారుమారు అవుతారు. అప్పటి సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు ఒకరినొకరు చూడకపోవడం, ప్రమాదంలో స్మృతి తప్పడం వలన అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరుకు అసలు జంటలెవరో తెలుస్తుంది. అయితే చరణదాసి చిత్రంలో పడవకు బదులు రైలు ప్రమాదం చూపించారు. అయితే రవీంద్రుని కథను యథాతథంగా తీయకపోవడం వలన ఈ చిత్రం చాల విమర్శలకు గురి అయింది. అంతేకాక బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసింది. చరణదాసి చిత్రానికి ఘంటసాల మాస్టారు పి.లీల, పి.సుశీల లతో చెరొక యుగళగీతం, సుశీలతో కొన్ని సంవాద పద్యాలు గానం చేశారు. ఎ.ఎన్.ఆర్., సావిత్రిలపై చిత్రీకరించిన ఘంటసాల-లీల పాడిన హిందోళంలో స్వరపరచిన ఒక చక్కని యుగళగీతం యొక్క దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను. సంగీతం ర'సాలూరు రాజేశ్వరరావు, రచన సముద్రాల రాఘవాచార్యులు.
లీల: ఆ..ఆ..
రథ సారధులు
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
ఘంటసాల: ఆ..ఆ..
లీల: గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే, వికాసాలివే
ఘంటసాల: ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
లీల: గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే, వికాసాలివే
ఘంటసాల: ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
లీల: మానస సీమల, మాయని ప్రేమల
మాధురులెపుడూ మారవుగా
ఘంటసాల: మారవులే... | మారవులే |
లీల: ప్రమాణముగా
ఘంటసాల: మారవులే
లీల: ప్రమాణముగా
ఘంటసాల: జీవన తారవు, దేవివి నీవే | జీవన |
ఇద్దరు: గులాబీల తావులీనే కులాసాల జీవితాల
మనజాలినా.. అదే చాలులే..
ఇదే ప్రేమ జీవితాల వరించే వరాలుగా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో అందించిన ప్రణీత్ గారికి, సినిమా వివరాలు పోస్టు చేసిన వికీపీడియా వారికి.
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో అందించిన ప్రణీత్ గారికి, సినిమా వివరాలు పోస్టు చేసిన వికీపీడియా వారికి.
Thank you. It's a great song. G & Leela are awesome!!!
రిప్లయితొలగించండిBTW, it's Anjali Devi not Jamuna.
Thank you sir. You are correct. I made that change.
తొలగించండిDear sir, the above link is not relevant to the song Gulabila taavulene,
రిప్లయితొలగించండిSivarami Reddi garu, thanks for your comment. I am not sure which link you are referring to. The audio file is same as Gulabeela Taavuleene.
తొలగించండి"చరణదాసి" లో మీరు పేర్కొన్నవారే కాకుండా ఇంకా కన్నాంబ, షావుకారుజానకి కూడా ఉన్నారండి.
రిప్లయితొలగించండిసత్యనారాయణ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు చెప్పినది నిజమే. అయితే పాట సన్నివేశం కథకు సంబంధించి సందర్భానుసారంగా కొందరినే ప్రస్తావించాను.
తొలగించండి