1962 లో విడుదలైన జగపతి వారి "ఆరాధన" చిత్రానికి యాభై సంవత్సరాలు నిండాయి. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. అవి మహాకవి శ్రీశ్రీ గారు "నా హృదయంలో నిదురించే చెలీ", కవితారుద్రులు శ్రీ ఆరుద్ర గారు వ్రాసిన "ఇంగ్లీషులోన మ్యారేజి, హిందీలో అర్ధము షాదీ" మరియు "ఒహోహో మామయ్యా! ఇదేమయ్యా". శ్రీమతి సుశీల గారు పాడిన రెండు మంచి సోలో పాటలు "వెన్నెలలోనీ వికాసమే" మరియు "నీ చెలిమీ నేడే కోరితిని". సంగీతం రసాలూరు రాజేశ్వర రావు గారు. ఈ చిత్రం గురించి శ్రీమతి సుధా రాణి గారు చక్కని రివ్యూ వ్రాసారు తమ బ్లాగులో. ఈ-టీవీలో నిన్ననే ఈ చిత్రంపై మూడు భాగాల రివ్యూ వచ్చింది. అది ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఆరాధన అంటూ తెలుగులో వచ్చిన మూడు సినిమాలల్లో అద్బుతమైన చిత్రం మాత్రం జగపతి వారి చిత్రానికే తరగని ఆరదన నేటికి. ఇటువంటి చిత్రాల గురించి వింటుంటే నా మనసు పులకరిచి పోతుంది .
మీ బ్లాగుపోస్టులో నా బ్లాగుపోస్టును ప్రస్తావించినందుకు - ధన్యవాదాలు, సూర్యనారాయణగారు. ఘంటసాల బ్లాగులో మీరు చెప్తున్న విశేషాలు కొత్తగా తెలుసుకుంటున్నాం....అందుకు కూడా.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
ఆరాధన అంటూ తెలుగులో వచ్చిన మూడు సినిమాలల్లో అద్బుతమైన చిత్రం మాత్రం జగపతి వారి చిత్రానికే తరగని ఆరదన నేటికి. ఇటువంటి చిత్రాల గురించి వింటుంటే నా మనసు పులకరిచి పోతుంది .
రిప్లయితొలగించండినమస్కారం సార్. మీ పేరు తెలియదు. క్షమించండి. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ రండి.
తొలగించండిసూర్యనారాయణగారూ, నా పేరును ఇక్కడ చెప్పినందుకు ధన్యవాదాలు. ఘంటసాల పాటలకో నిధి పెట్టినందుకు చాలా సంతోషం.
రిప్లయితొలగించండిసుధారాణి గారు, మీరు నా పని సుగమం చేశారు మీ సమీక్షతో. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
తొలగించండిమీ బ్లాగుపోస్టులో నా బ్లాగుపోస్టును ప్రస్తావించినందుకు - ధన్యవాదాలు, సూర్యనారాయణగారు. ఘంటసాల బ్లాగులో మీరు చెప్తున్న విశేషాలు కొత్తగా తెలుసుకుంటున్నాం....అందుకు కూడా.
రిప్లయితొలగించండిసుధ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండినా హృదయంలో నిదురించే చెలి, నీ చెలిమి నేనే కోరితిని ఇవి రెండు నాకిష్టమైన పాటలు. అందులో సావిత్రి అభినయం మరపురానిది.
రిప్లయితొలగించండి