ఘంటసాల మాస్టారిని మనమంతా ఎంతో ఆరాధిస్తాం. ఆయన పాడిన పాటలు, పద్యాలు, కట్టిన బాణీలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అటువంటి ఎన్నో చక్కని అనుభూతులు మనకు మిగిల్చారు మాస్టారు. నిజంగా మనమెంతో అదృష్టవంతులం అని మనకు అనిపిస్తుంది కదా! అలా అంటే, మరి ఆయనతో ఏడడుగులు నడిచి, వారి సంగీత స్రవంతిలో భాగస్వామియైన మాస్టారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మ గారు ఇంకెన్ని మధురానుభూతులు పంచుకున్నారో! ఇది ఆమె మాత్రమే తెలుపగలరు. ఇటీవల శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారు హెచ్.ఎం.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాస్టారి మధుర జ్ఞాపకాలను తెలియజేసారు. శ్రీమతి సావిత్రమ్మ గారు ఎన్నో విషయాలను, విశేషాలను విపులంగా చెప్పారు. రెండు భాగాలుగా యూ ట్యూబ్ లో పోస్టు చేయబడిన ఆ వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. మధ్య మధ్య వచ్చే అసందర్భ వాణిజ్య ప్రకటనలు మినహాయిస్తే, ఇది చక్కని ఇంటర్వ్యూ అనిపించింది. కారణం ఏంకర్ తక్కువగా మాట్లాడిన ఇంటర్వ్యూ కనుక.
కృతజ్ఞతలు: హెచ్.ఎం.టీవీ
మొదటి భాగం
రెండవ భాగం
కృతజ్ఞతలు: హెచ్.ఎం.టీవీ
మీ సేకరణ అద్భుతంగా ఉందండీ..! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినా బ్లాగు ’సొంతఘోష’లో ఘంటసాల గారి ఫోటోలు కొన్ని ఉంచాను. వీలైతే చూడండి. http://radhemadhavi.blogspot.in/2010/10/blog-post_27.html. ధన్యవాదాలు.