ఇద్దరు మిత్రులు చిత్రం విడుదలై యాభై సంవత్సరాలు అయ్యింది. ఇటీవల రెండు టీవీ సంస్థలు విడివిడిగా ఇద్దరు మిత్రులు చిత్ర స్వర్ణోత్సవం విశేషాలను ప్రసారం చేసాయి. అయితే వాటిలో కొంత వ్యత్యాసం ఉండటం వలన అన్ని యూ ట్యూబ్ లింకులు ఇక్కడ పొందు పరుస్తున్నాను. రాజు-పేద చిత్రం మినహాయిస్తే, తెలుగు సినీ రంగంలో పెద్ద హీరో అయిన అక్కినేని నాగేశ్వర రావు గారు ద్విపాత్రాభినయం చేయడం ఈ చిత్రంతో ప్రథమం. గొప్పవాడు-పేదవాడు గా రెండు పాత్రలు పోషించడం లో శ్రీ ఎ.ఎన్.ఆర్. వైవిధ్యం చూపించిన ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయితలు శ్రీ ఆరుద్ర, శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు గార్లు తమ కలాల నుండి పది కాలాలు నిలిచిపోయే పాటలు వ్రాసారు. అయితే సినీ గీత రచయితగా శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల వారికిది తొలి చిత్రం. అంతవరకూ నిజాముల నిరంకుశత్వానికి తన కలం బలం చూపిన దాశరధి గారు తన మరొక ప్రావీణ్యాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు పంచడం మొదలు పెట్టారు. ఒక ప్రయోగం ఏమిటంటే మొదటి సారిగా తెలుగు సినిమాలో ఖవ్వాలీ టైపు పాట "నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి" వ్రాసిన ఘనత శ్రీ దాశరధి గారిది. దీనిని శ్రీమతి పి.సుశీల బృందం పాడారు.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వెండి తెరపై నాట్య తారగా అడుగుపెట్టి అంతవరకూ చిన్న పాత్రలు వేసిన తమిళ మాతృభాషా నటి ఇ.వి.సరోజ తొలిసారిగా కథానాయిక పాత్రలో నటించిన చిత్రమిది. ఇక పాటలకు వస్తే అంతా సురసాలూరించే స్వర రాజేశ్వరం. అన్నీ చక్కని పాటలే. మొత్తం ఇద్దరు మిత్రులు చిత్రానికి తొమ్మిది పాటలు వ్రాసారు గేయ రచయితలు. అందులో ప్రముఖమైనవి, ఘంటసాల, సుశీల గార్లు పాడినవి - పాడవేల రాధికా, ఓహో ఓహో నిన్నే కోరెగా (శ్రీశ్రీ); హలో హలో ఓ అమ్మాయి, ఈ ముసిముసి నవ్వుల (ఆరుద్ర); ఖుషీ ఖుషీగా నవ్వుతూ (దాశరధి). భద్రాచల రామదాస కీర్తనకు పేరడీ వంటి కొసరాజు గారి రచించిన మాధవపెద్ది సత్యం గారు పాడిన "శ్రీరామ నీ నామమెంతో రుచిరా", దానికి శ్రీ రమణారెడ్డి గారి అభినయం ఎవరు మరచిపోగలరు. నటీనటుల విషయానికొస్తే అంతవరకూ చిత్రసీమలో బాలనటిగా ఎదుగుతూ తొలిసారి హీరో చెల్లెలి పాత్ర పోషించిన శ్రీమతి శారద నటన ప్రశంశనీయం. తదుపరి కాలంలో ముమ్మారు ఉత్తమ నటిగా "ఊర్వశి" జాతీయ అవార్డు లభించిన ఒకే ఒక తెలుగు నటి ఊర్వశి శారద. అన్నా చెల్లెళ్ళ ఆప్యాయతలు, అభిమానాలు తెలియచెప్పే చక్కని కుటుంబ చిత్రం ఇద్దరు మిత్రులు.
ఎ.ఎన్.ఆర్ కన్నా వయసులో చిన్న అయిన హీరోయిన్ తండ్రి భానోజీ రావు పాత్రలో నటించిన గుమ్మడి గారు విలన్ పాత్ర అంటే ఇలా వుండాలి అని నిరూపించారు. ఆరోజుల్లో హాస్య పాత్రధారులకు, ప్రక్క పాత్ర దారులకు తప్పనిసరిగా సరదా అయినా పాటలు ఉండటం ఆనవాయితీ. ఈ చిత్రంలో పద్మనాభం, శారదలకు "చక్కని చుక్క సరసకు రావే" అనే చక్కని పాటను గారు వ్రాయగా శ్రీ పి.బి.శ్రీనివాస్, పి.సుశీల పాడారు. మరొక హాస్య జంట రేలంగి, సూర్యకాంతం గార్లు. ఒకసారి గుమ్మడి గారు సూర్య కాంతంతోగారితో అన్నారట "నువ్వు తెలుగు వాళ్లకు చాల అన్యాయం చేసావే. ఎందుకంటే, నీ పేరు ఎవ్వరూ పెట్టుకోకుండా చేసావు" అని. అంత గొప్ప నటి, నిజ జీవితంలో సౌమ్యురాలు ఆవిడ. ఇలా మహామహులు అందరూ నటించి, సంగీత-సంభాషణలతో కుటుంబ కథను, అభిమానము, ఆప్యాయత, స్నేహానికి దర్పణం పట్టిన అన్నపూర్ణా వారి ప్రతిష్టాత్మక చిత్రం "ఇద్దరు మిత్రులు" ఎన్ని సార్లయినా చూడాలనిపిస్తుంది.
కృతజ్ఞతలు: చిమట మ్యూజిక్, పాడుతా తీయగా చల్లగా, యు ట్యూబ్ మరియు ఓల్డ్ తెలుగు సాంగ్స్ డేటాబేస్ .
మంచి సమాచారమండీ... ఈ సినిమా స్క్రీన్ ప్లే అప్పట్లో సినిమా రంగం లోనో , ఇంకే దాంట్లోనో వచ్చింది .. నేను చదివిన గుర్తు. అది చదివాకే నేనా సినిమా చూశాను. శారదకి ఇది మొదటి సినిమా అనుకున్నాను.. బాల నటిగా కూడా చేసిందని తెలిసి ఆశ్చర్యము వేసింది. ఇ. వి సరోజ మళ్ళీ ఎందుకో హీరోయిన్ గా రాలేదు ( తెలుగులో ) . చదువుకున్న అమ్మాయిలు లో ప్రాధాన్యము లేని పాత్ర చేసింది. అప్పట్లో ఎక్కువ పేరున్న సావిత్రి , కృష్ణ కుమారి , జమున వంటి వారు లేకుండానే ఈ సినిమా అఖండ విజయము సాధించిందంటే దానిక్కారణము ఏ ఎన్ ఆర్ గారి వైవిధ్యమైన నటన , పాటలు.
జనార్ధన శర్మగారు, ధన్యవాదాలు. ఇ.వి.సరోజ గారి గురించి నాకు అంతగా తెలియదు. ఆవిడ చాల తక్కువ తెలుగు చిత్రాలలో నటించారు. నాగేశ్వరరావు, గుమ్మడి గార్ల నటన, అద్భుతమైన బాణీలు, ముఖ్యంగా మాస్టారి పాటలు చిత్రానికి ఆయువు పట్టు. ఎస్.రాజేశ్వర రావు గారు కొన్ని పాశ్చాత్య బాణీలను కూడ తెలుగులో చక్కగా వాడారు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
మంచి సమాచారమండీ... ఈ సినిమా స్క్రీన్ ప్లే అప్పట్లో సినిమా రంగం లోనో , ఇంకే దాంట్లోనో వచ్చింది .. నేను చదివిన గుర్తు. అది చదివాకే నేనా సినిమా చూశాను. శారదకి ఇది మొదటి సినిమా అనుకున్నాను.. బాల నటిగా కూడా చేసిందని తెలిసి ఆశ్చర్యము వేసింది. ఇ. వి సరోజ మళ్ళీ ఎందుకో హీరోయిన్ గా రాలేదు ( తెలుగులో ) . చదువుకున్న అమ్మాయిలు లో ప్రాధాన్యము లేని పాత్ర చేసింది. అప్పట్లో ఎక్కువ పేరున్న సావిత్రి , కృష్ణ కుమారి , జమున వంటి వారు లేకుండానే ఈ సినిమా అఖండ విజయము సాధించిందంటే దానిక్కారణము ఏ ఎన్ ఆర్ గారి వైవిధ్యమైన నటన , పాటలు.
రిప్లయితొలగించండిమంచి సినిమాను గుర్తు చేశారు...
రిప్లయితొలగించండిజనార్ధన శర్మగారు, ధన్యవాదాలు. ఇ.వి.సరోజ గారి గురించి నాకు అంతగా తెలియదు. ఆవిడ చాల తక్కువ తెలుగు చిత్రాలలో నటించారు. నాగేశ్వరరావు, గుమ్మడి గార్ల నటన, అద్భుతమైన బాణీలు, ముఖ్యంగా మాస్టారి పాటలు చిత్రానికి ఆయువు పట్టు. ఎస్.రాజేశ్వర రావు గారు కొన్ని పాశ్చాత్య బాణీలను కూడ తెలుగులో చక్కగా వాడారు.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిGood article, Thanks for Sharing. Keep on blogging!
రిప్లయితొలగించండిAndhra film news
nice post..
రిప్లయితొలగించండిlatest tollywood news and gossips
చాలా విషయాలు తెలియనివి తెలిపినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండి