1948 లో విడుదలైన బాలరాజు చిత్రం అప్పటివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నమైనది. సాధారణంగా అమ్మాయి వెంట అబ్బాయి పడితే, ఈ చిత్రంలో రివర్సు. శాపవశాన ప్రేమికులైన యక్షులు భూమ్మీద మానవులుగా (ఎ.ఎన్.ఆర్., ఎస్.వరలక్ష్మి) పుడతారు. హీరోలు, హీరోయిన్లు రెండు జన్మలలో వేరే. ఎందుకో తెలియదు. అయితే భూమ్మీద హీరోకి హీరోయిన్ గుర్తుండదు. అది శాప ఫలితం. తనని గుర్తు పట్టేవరకు హీరోయిన్ హీరో చుట్టూ తిరుగుతుంటుంది. అంతవరకూ పౌరాణిక పాత్రలు వేసిన అక్కినేనికి ఈ సినిమా ఒక బ్రేక్, ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో మొదట ఎ.ఎన్.ఆర్. తన పాత్రకు తానే పాడారట. అప్పట్లో నటీనటులు ఎవరి పాత్రకు వాళ్ళు పాడుకొనేవారు. (అఫ్ కోర్స్! ఈ రోజుల్లో పాటతో పాటు మాట కూడా పడిపోయింది) అయితే ఆయనది మరీ ఆడ గొంతులా ఉండటంతో, ఘంటసాల గారు ప్రథమంగా నాగేశ్వర రావుకు నేపథ్యగానం చేసారు. ఈ చిత్రానికి శ్రీ గాలి పెంచల నరసింహారావు గారు సంగీత దర్సకత్వం వహిస్తే వారికి సహాయకులుగా శ్రీ సుబ్బరామన్, శ్రీ ఘంటసాల గార్లు పని చేశారు. వీరిరువురు తరువాత గొప్ప సంగీత దర్శకులయ్యారు. ఈ చిత్రంలో చారిత్రాత్మకమై, నాగేశ్వరరావు గారి కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఘంటసాల మాస్టారు పాడిన "చెలియా కనరావా" పాట ఆడియో, వీడియో, సాహిత్యం పొందు పరుస్తున్నాను. ఈ పాట నాగేశ్వర రావు గారి గొంతులో కూడా రికార్డు చేసారు. కాని సినిమాలో మాస్టారి పాట పెట్టారు. ఈ పాట ఆడియో ఫైలులో ఘంటసాల గారితో తమ అనుబంధాన్ని, అనుభవాన్ని అక్కినేని మాటలలో వినవచ్చును.
సంగీత సాహిత్య సమ వుజ్జీలు
చిత్రం: బాలరాజు (1948)
రచన: సముద్రాల రాఘవాచార్య (సీనియర్)
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
ప. చెలియా కనరావా, చెలియా కనరావా
నిరాశబూని పోయితివా ఓ! చెలియా కనరావా | నిరాశ |
ఓ!.. చెలియా కలయేనా మన గాథా, | ఓ!.. చెలియా |
చెలియా కనరావా, చెలియా కనరావా
చ. యే కోనలలోన నిను గానా.. | యే కోనల |
యే దారి పోయితివో నా దారి యేమో | యే దారి |
చెలియా కనరావా
చ. తనువు, మనసు నీదే
నా తనువు, మనసు నీదే
నీవేనని బాస జేసినావే జవరాలా | నీవేనని |
రారాని కోపాలు నాపైన నీకేల | రారాని |
చెలియా కనరావా నిరాశబూని పోయితివా..
కలయా మన గాథా, చెలియా, కలయా మన గాథా
కలయా మన గాథా
Very good comments by Akkineni in the audio file about Ghantasala.This song as the first one of Ghantasala to Akkineni is a special feast to our ears.Thank you for sharing with us.
రిప్లయితొలగించండిradharao
Radharao garu, you are welcome. Happy New Year.
రిప్లయితొలగించండిశ్రీ సూర్యనారాయణగారు ! మీరు ఘంటసాల గారి మీద అభిమానంతో పొందుపరచిన బ్లాగ్ చాల బాఉగుంది. ఇంకా పూర్తిగా చూడాలి. మీ కృషి అభినందనీయం
రిప్లయితొలగించండిశ్రీ శ్రీనివాస మూర్తి గారికి, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మీవంటి పెద్దల ఆశీస్సులు తప్పక కావాలిం నమస్కారం.
తొలగించండిశ్రీ సూర్యనారాయణగారు ! మీరు ఘంటసాల గారి మీద అభిమానంతో పొందుపరచిన బ్లాగ్ చాల బాఉగుంది. ఇంకా పూర్తిగా చూడాలి. మీ కృషి అభినందనీయం
రిప్లయితొలగించండిSir, Akkineni Nageswara Rao did not act as Yaksha in this film. He performed only as the human form ie. Balaraju. The names of the actors are shown in the titles along with the names of their characters. I saw that the Yaksha's part was performed by someone else.
రిప్లయితొలగించండిYou can see that in this video
http://www.youtube.com/watch?v=1XwfWF2dFgQ
ప్రియంష్ మంచి పాయింట్ పట్టుకున్నారు. ధన్యవాదాలు. తగు విధంగా మార్పు చేశాను.
తొలగించండి