భక్త రఘునాథ్ |
చిత్రం: భక్త రఘునాథ్ (1960) చిత్రం నుండి
రచన: సముద్రాల రాఘవాచార్య
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
పద్యం:
అదిగో.. జగన్నాథుడాశ్రితావళి గావ కొలువు తీర్చెడు గుడిగోపురమ్ము ఆ.. ఆ.. ఆ
తన పేరుమీద ఇంద్రద్యుమ్న భూపతి యీ తటాకమ్ము త్రవ్వించెనంటా ఆ.. ఆ.. ఆ..
కనుమీ సరస్సు మార్కండేయముని దయాసారమ్ము సకలార్థ సాధనమ్ము.. ఊ.. ఊ... ఊ..
రథయాత్రలో సుభద్రారాములను గూడి | రథయాత్రలో |
విశ్రాంతిగైకొను విడిది యిదిగో..ఓ..ఓ..
ఈ మహోదధి నీరాడెనేని పరమ పాపియైనను పొందు కైవల్య పథము
అఖిలజీవులు ఆశించు అమృతసీమ శరణుజేయుమదే భావి చరణ సీమ ఆ..ఆ..ఆ..
బాగుంది. బాణీ అచ్చం .. ఉమ్మడికుటుంబం యముడి పద్యంలా లేదూ?
రిప్లయితొలగించండి