తిన్నడు (కన్నప్ప) మహా శివభక్తుడు. తనను బంధ విముక్తి చేయమని తనకు శివునిపై గల భక్తిని, గుండెలోని ఆర్తిని గొంతులోకి తెచ్చుకుని ఆలపించే సన్నివేశం ఎలా వుంటుందో తెలియాలంటే కాళహస్తి మహాత్మ్యం లో మాస్టారి పద్యాలు వింటే తెలుస్తుంది. పద్యాలు పాడితే ఘంటసాల గారే పాడాలి. పద్యాలు, శ్లోకాలు పాడటంలో ఒక క్రొత్త వరవడిని సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న అమర గాయకుడు ఘంటసాల మాస్టారు. ఇక్కడ కాళహస్తి మహాత్మ్యం నుండి మరికొన్ని పద్యాల వీడియో, ఆడియో, మరియు సాహిత్యం యిక్కడ పొందుపరుస్తున్నాను.
వీడియో & ఆడియో మూలం: ప్రాజెక్టు ఘంటసాల
స్వామీ! చంచలమైన చిత్తమిదె నీ జ్ఞానాంజనా రేఖచే
వీడియో & ఆడియో మూలం: ప్రాజెక్టు ఘంటసాల
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్. గోవర్ధనం, ఆర్. సుదర్శనం
స్వామీ! చంచలమైన చిత్తమిదె నీ జ్ఞానాంజనా రేఖచే
నీమంబున్ గొనె నిశ్చలత్వ మొదవెన్ నిండారు నీ భక్తిచే
కామ క్రోధ విరోధ వర్గములు చీకాకై నశించెన్, భవ
ద్ధామంబౌ రజితాద్రిచేర్చ దయరాదా కాళహస్తీశ్వరా
కాళహస్తీశ్వరా...
శ్రీకాళహస్తీశ్వరా...
ఆ..ఆ...ఆ..ఆ..ఆ
చండహుతాసు కీలికలు చయ్యన గ్రక్కుచు దండధారి మా
ర్కండునిపై మహోగ్రగతి గ్రక్కునవైచిన కాలపాశమే..
గ్రక్కునవైచిన కాలపాశమే
తుండెములై, పఠాలుమని తూలిపడెన్, నిను నమ్మువారికీ
దండనలేమి లెక్క, రజితాచలవాస మహేశా! ఈశ్వరా!...ఆ..ఆ
ధన్యుడనైతిని దేవదేవా (2)
ఎన్నడైన మరువనయ్య పాద సేవా
ఎన్నడైన మరువనయ్య నీ పాద సేవా
పాహీ శంకరా! మాం పాహీ శంకరా!
మాం పాహీ శంకరా!
పాహిమాం పాహీ శంకరా!
కృతజ్ఞతలు: సాహిత్యం యొక్క ప్రతులు అడగకుండానే అందించిన శ్రీ కొల్లూరి భాస్కర్ (ఘంటసాల సంగీత కళాశాల సంచాలకులు, హైదరాబాద్) గారికి.
ఈ చిత్రం యొక్క ఇతర వివరాలకు, ఆర్ఖైవ్స్ కు "ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి" మరియు "సఖియా" లో చూడగలరు.
ఈ చిత్రం లోని దండకం "జయ జయ మహాదేవ శంభో" యింతకు ముందు పోస్టులో చూడగలరు.
అద్భుతమైన గాత్రం, చక్కటి సంగీతం.
రిప్లయితొలగించండివిడియో, ఆడియోలలో గొంతులో ఏదో తేడా వినిపిస్తోంది. ఆడియో చాలా ఏళ్ళ తరువాతది లా వుంది కదండి, సూర్య గారు?
రిప్లయితొలగించండిSNKR గారు, ధన్యవాదాలు. నిజమే కొంత వ్యత్యాసముంది. అయితే దొరికిన వాటిలో ఇవే బాగున్నాయి. ఒకో సారి యూ ట్యూబ్ వాళ్ళు ముందు హెచ్చరించకుండా వీడియో తొలగిస్తుంటారు. అందువలన ఎందుకయినా మంచిదని ఆడియో ఫైలు కూడ ఇచ్చాను. మీ సునిశిత శ్రవణానికి అభినందనలు.
రిప్లయితొలగించండిమీకూ అలానే వినిపించిందంటే తృప్తిగా వుంది.
రిప్లయితొలగించండిమీకు ఏది నచ్చింది? చెప్పండి.