చిత్రం: కాళహస్తి మహాత్మ్యం
గానం: ఘంటసాల
రచన: తోలేటి వెంకట రెడ్డి
సంగీతం: ఆర్.సుదర్శనం - ఆర్. గోవర్ధనం
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఘంటసాల మాస్టారు పరమ శివునిపై చాల పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. ప్రతి వొక్క పాట, పద్యం రుద్రునికి సమర్పించే మాలలో రుద్రాక్షల వంటివి. కన్నడ రాజ్ కుమార్ కన్నప్ప (తిన్నడు) గా నటించిన "బేదర కన్నప్ప" ఆయన నటజీవితాన్ని మలుపు తిప్పింది. అదే చిత్రాన్ని తెలుగులో కాళహస్తి మహత్యం (1954) గా డబ్ చేసారు. ఇందులో మాస్టారు పాడినవన్నీ ఆణిముత్యాలే. ముందుగా ఈ దండకం "జయ జయ మహాదేవ శంభో" యొక్క సాహిత్యం యిక్కడ పొందు పరుస్తున్నాను. ముందు ముందు మరికొన్ని. ఇందులో చాల మట్టుకు పద్యాలు. అయితే ఈ పద్య రూప నిర్మాణంలో సూచనలుంటే తెలుపగలరు.
ఆడియో మూలం: ప్రాజక్టు ఘంటసాల
సత్యశివసుందరా, నిత్యగంగాధరా
బ్రహ్మ విష్ణుల్, సురల్, తాపసుల్
నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా
భీకరారణ్య మధ్యంబునన్ బోయనైపుట్టి పశుపక్షి సంతానముల్
కూల్చి భక్షించు పాపాత్ముడన్
దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడన్
దేవుడేలేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్
విశ్వరూపా, మహామేరుచాపా,
జగత్ సృష్టి, సంరక్ష, సంహార కార్యత్కలాపా
మహిన్ పంచభూతాత్మవీవే కదా దేవదేవా శివా
పృథ్వి జల వాయురాకాశ తేజో విలాసా మహేశా.. ప్రభో.....
రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా
కాశీపురాధీశ విశ్వేశ్వరా
నీలిమేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైలమల్లేశ్వరా..శ్రీశైలమల్లేశ్వరా..
కోటినదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా..శ్రీరామలింగేశ్వరా
నిత్యగోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా..భీమేశ్వరా...
దివ్యఫలపుష్ప సందోహ బృందార్చితానంద భూలోకకైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా..
దేవదేవా...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
నమస్తే... నమస్తే...నమస్తే..నమః
-----------------------------------------------------------------------
http://www.sakhiyaa.com/kalahasti-mahatyam-1954-%e0%b0%95%e0%b0%be%e0%b0%b3%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/
-----------------------------------------------------------------------
ఈ చిత్రం యొక్క వివరాలకు క్రింది లింకులలో చూడండి.
http://ghantasalagalamrutamu.blogspot.com/2009/05/1954.html http://www.sakhiyaa.com/kalahasti-mahatyam-1954-%e0%b0%95%e0%b0%be%e0%b0%b3%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/
కార్తీక మాసం లో తోలి సోమవారం రోజున పరమ శివుణ్ణి ప్రత్యక్షం గా దర్శించుకున్న అనుభూతి కలిగింది.ఘంటసాల గళం లో జాలువారిన దండకం గంధర్వ లోకం లో విహరించిన అనుభూతి కలిగించింది. ఆ అనుభూతిని కలిగించిన మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండియస్ యస్.యస్.శ్రీ గణేశ్.
విశాఖపట్నం.
రాఘవేంద్రరావు గారు, ధన్యవాదాలు. మీ స్పందన ఎంతో ఉత్తేజితంగా వుంది. కృతజ్ఞతలు. ఓం నమశ్సివాయ
రిప్లయితొలగించండి"'cAlA jalubu tO pADAru kabOlu mAsTAru gAru... mukhyaMgA Akharuna vaccE
రిప్లయితొలగించండినమస్తే... నమస్తే...నమస్తే..నమః anE cOTa" ...ani mA amma gAru anE vAru
మోహన్ గారు. నిజమే. నాకు కూడ అలానే అనిపించింది. సత్య 'శివ సుందరా' బదులు 'జలుబు చేసిందిరా' అనుకునేవాడిని.
తొలగించండిఈ చిత్రం తెలుగులో నిర్మించబడింది. డబ్బింగు సినిమా కాదు.
రిప్లయితొలగించండి