Thanks to Volga Video for up loading the video clip to You Tube
ఆడియో మూలం: వీడియో నుండి
| చిత్రం: | పెళ్ళి సందడి (1959) | |
| గీత రచన: | సముద్రాల జూనియర్ | |
| సంగీతం: | ఘంటసాల | |
| నేపథ్య గానం: | ఘంటసాల, రావు బాలసరస్వతి |
| ఆహా! | ||
| సాకీ: | ఘంటసాల: | చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికా |
| లాపన సేయు కూర్మి జవరాలొకవైపు, మరొక్క వైపునన్ | ||
| ఈ పసి కమ్మతెమ్మరలు ఈ పువుదోటల శోభలున్నచో | ||
| రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాలతేలుమా | ||
| ఆ..ఆ..ఆ…ఆ..ఆ..ఆ.. | ||
| పల్లవి: | ఘంటసాల: | రావే ప్రేమలతా, నీవే నా కవితా |
| కిన్నెర మీటుల కిలకిలవే, పలువన్నెల మెఱపుల మిలమిలవే | ||
| బాలసరస్వతి: | ఓహో! కవిరాజా, నేడే నెలరాజా | |
| ఎందులకోయి పరవశము, నీకెందులకోయీ కలవరము | ||
| చరణం: | ఘంటసాల: | పూవులలో, నును తీవెలలో, ఏ తావున నీవే వనరాణి |
| పూవులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి | ||
| బాలసరస్వతి: | అందవతి కనుపించినచో కవులందరి చందమిదేలే | |
| ఓహో! కవిరాజా, నేడే నెలరాజా | ||
| చరణం: | ఘంటసాల: | పరువులిడే, సెలయేరువలె, నిను చేరగ కోరును నా మనసు |
| పరువులిడే సెలయేరువలె నిను చేరగ కోరును నా మనసు | ||
| బాలసరస్వతి: | ఊహలతో ఉలికించకుమా, నవమోహన ఈ చెలి మదినీ | |
| ఘంటసాల: | రావే ప్రేమలతా, నీవే నా కవితా | |
| చరణం: | బాలసరస్వతి: | ముచ్చటగా మనముండినచో మన మచ్చికకు జగమేమనునో |
| ఘంటసాల: | లోకముతో మనకేమి పని, మనసేకమయీ మనముంటే | |
| బాలసరస్వతి: | నేనే నీ కవితా! | |
| ఘంటసాల: | రావే ప్రేమలతా! | |
| బాలసరస్వతి: | ఓహో హోహొహొహో | |
| ఘంటసాల: | ఓహో హోహొహొహో | |
| ఇద్దరు: | ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ..ఊ.. |



that is ghantasala
రిప్లయితొలగించండిఎన్నో ఆణిముత్యాలు ఇలా కూర్చి పెడుతున్నారు... నెనర్లు!
రిప్లయితొలగించండిధన్య వాదములు
రిప్లయితొలగించండి