1954
సంవత్సరంలో విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన “అంతా మనవాళ్ళే” చిత్రం నుండి ఘంటసాల పాడిన
“వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా” అనే ఈ ఏకగళగీతం రచన కొనకళ్ళ వెంకటరత్నం, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం వల్లం నరసింహారావు,
కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్
మరియు దర్శకుడు తాపీ చాణక్య."బంగారిమామ" పాటల రచయితగా ఖ్యాతిగాంచిన వారు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో
పుట్టిన కొనకళ్ళ వెంకటరత్నం గారు. ఘంటసాల మాస్టారు ఆలపించిన ప్రైవేట్ గీతం “రావోయి
బంగారి మామా” వీరి రచనే. ఇదేకాక, ప్రతోళి (ప్రతోళి = ప్రధాన రహదారి), పొద్దుతిరుగుడు పూలు అనే గేయకృతులను కూడ
వ్రాసారీయ.అంతేకాక, కథారచయిత కూడ. ఈయన వ్రాసిన
“మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో” తొలిసారి సిపాయికూతురు (1959) సినిమాలో వాడుకున్నారు.
మళ్ళీ అదేపాటను జగపతి వారి అదృష్టవంతులు (1969( సినిమాలో ఉపయోగించుకున్నారు.
ఇతర వివరాలు వికిపీడియా లింకులో చూడగలరు.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.



కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి