1962 లో నిర్మించబడిన భాగ్యవంతులు అనే డబ్బింగ్ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, రాజసులోచన. ఎం ఆర్. రాధ, ఇ.వి.సరోజ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారి స్వీయ సంగీత దర్శకత్వం. ఈ చిత్రం కోసం మాస్టారు నాలుగు పాటలు పాడారు. చిత్రం ఏమిటంటే రచయిత ఉషశ్రీ గారు కధానాయిక పేరును కూడ పాటలో సందర్భోచితంగా ఇమిడ్చారు. మాస్టారు బాణీకూర్చిన ఈ యుగళగీతం శ్రావ్యంగా, సుమధురంగా, కర్ణపేయంగా వుంది.
|
చిత్రం: |
భాగ్యవంతులు
(డబ్బింగ్)-1962 |
|
గానం: |
ఘంటసాల, సుశీల |
|
సంగీతం: |
ఘంటసాల |
|
రచన: |
ఉషశ్రీ |
|
దర్శకత్వంః |
పి. నీలకంఠం |
Video Courtesy: Sri Rajasekhar Raju
| పల్లవి |
సుశీలః |
చిరునగవే నీ సింగారం |
|
|
చిగురించెనులే మన నయగారం |
|
|
చిరునగవే నీ సింగారం |
|
|
|
| చరణం |
సుశీల - |
ఇంపుగొల్పెడి నీ రూపే నా సొంపుకందం పూచెనురా -2 |
|
ఘంటసాల - |
తేలిపోయెడి నా హృదయం ఇక నీ కౌగిలినే కోరెనులే -2 |
|
సుశీల - |
ఉదయసూర్యుని ఎదురు నిలిచిన హృదయకమలము వికసించే |
|
|
హృదయకమలము వికసించే |
|
ఘంటసాల - |
రాజసులోచన రోజాయనుకుని -2 |
|
|
హృదయభ్రమరము మూగినదో..ఓ.ఓ -2 |
|
సుశీల - |
చిరునగవే నీ సింగారం |
|
|
చిగురించెనులే మన నయగారం |
|
|
చిరునగవే నీ సింగారం |
|
|
|
| చరణం |
సుశీల - |
ఈ మలయానిలం ప్రణయవిహారం -2 |
|
|
అమృతధారల కనలేవో |
|
ఘంటసాల - |
అందం చిందే ప్రకృతిలోన నీ మృదువదనము కాంచితినే -2 |
|
సుశీల - |
పరిమళమొలికే పన్నీట మునిగీ -2 |
|
|
తేలియాడెదమో రాజా |
|
ఇద్దరు- |
చిరునగవే మన సింగారం |
|
|
చిగురించెనులే మన నయగారం |
|
|
చిరునగవే మన సింగారం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి