1961 లో శ్రీ సారథీ స్టూడియోస్
సంస్థ తాపీ చాణక్య దర్శకత్వంలో
నిర్మించిన చిత్రం కలసివుంటే కలదు
సుఖం చిత్రం నుండి ఆరుద్ర
రచనను మాస్టర్ వేణుస్వరపరచగా, ఘంటసాల
పాడిన నా వరాల
తండ్రీ నీవేల పుడితివి? అనే
ఏకగళగీతం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
| సాకీ: | నా వరాల తండ్రీ..ఈ.. నీవేల పుడితివి? | ||
| పల్లవి: | నా వరాల తండ్రీ నీవేల పుడితివి? -2 | ||
| ఏయింట పుట్టినను, హాయిగా మనగలవు | |||
| మాయింట పుట్టావా! నా పిచ్చి తండ్రి | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | నా జన్మమెందుకని నేనే చింతించ | ||
| నీవేల పుట్టావూ బంగరుకొండ? | |||
| నా జన్మమెందుకని నేనే చింతించ | |||
| నీవేల పుట్టావూ బంగరుకొండ | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | భర్తయను పదమునకు భరియించువాడనుచు | ||
| అర్థము చెబుతారూ లోకానా | |||
| భర్తయను పదమునకు భరియించువాడనుచు | |||
| అర్థము చెబుతారూ లోకానా | |||
| భార్యకు భారముగా, భూమికి భారముగా | |||
| బ్రతుకును విధిలేకా నీ తండ్రి | |||
| నా వరాల తండ్రీ నీవేల పుడితివి? | |||
| చరణం: | ఓర్చుకొను సుగుణములో భూమాతనే మించే | ||
| ఉత్తమా యిల్లాలు నీ తల్లి | |||
| ఓర్చుకొను సుగుణములో భూమాతనే మించే | |||
| ఉత్తమా యిల్లాలు నీ తల్లి | |||
| నీవెదిగి యిరువురికి నీడయిచ్చే వరకు | |||
| నీ తల్లికీ పాట్లు తప్పవుగా | |||
| జోజో నా బాబూ, జోజో బాబూ -2 | |||
| జోజో బాబూ, జోజో బాబూ |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి