పల్లేటూరు
వాతావరణం, ఇరుగుపొరుగుల స్నేహాలు, ముచ్చట్లు అలనాడుండేవి. అలాంటి రెండు కుటుంబాల కథ
1950 లో విజయాసంస్థ నిర్మించిన “షావుకారు”. అందులో ఆ స్నేహితులు ఒక అబ్బాయి, అమ్మాయి
అయితే వారి మధ్య స్నేహం ప్రేమగా మారి పరోక్షంగా ప్రేమ సందేశాలు పంపడమో రాయబారం నడపడమో
జరుగుతుంది. అయితే సముఖంలోనే వుంటే రాయబారమెందుకు? కథానాయకుడు కథానాయికకు ఇచ్చే సందేశగీతాన్ని
సముద్రాల రాఘవాచార్యులు చక్కని మాటలలో పొందుపరచగా, ఘంటసాల మాస్టారు అతి తక్కువ వాయిద్యాలతో,
సుతిమెత్తని బాణీలో పాటను అందంగా కూర్చి అద్భుతంగా గానం చేసారు “పలుకరాదటే చిలకా” అని. తెలుగు సినిమాలకు ఆరోజుల్లోనే ట్యాగ్ లైన్ మొదలయ్యాయి కాబోలు. షావుకారు చిత్రానికి "ఇరుగు పొరుగుల కథ" అనే ట్యాగ్ లైన్ పోస్టరులో చూడొచ్చు. ఈ చిత్రంలో తొలిసారిగా నటించి కథానాయిక "షావుకారు జానకి" గా సుప్రసిద్ధి గాంచింది.
| చిత్రం: | షావుకారు (1950) | ||
| రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
| గానం: | ఘంటసాల | ||
| సంగీతం: | ఘంటసాల |
| సాకీ: | ఘంటసాల: | పలుకరాదటే చిలుకా | ||
| పల్లవి: | పలుకరాదటే.. | |||
| పలుకరాదటే, చిలుకా పలుకరాదటే -2 | ||||
| సముఖములో రాయబారమెందులకే -2 | ||||
| పలుకరాదటే చిలుకా పలుకరాదటే | ||||
| చరణం: | ఎరుగని వారమటే, మొగమెరుగని వారమటే -2 | |||
| పలికిన నేరమటే, పలుకాడగ నేరవటే | ||||
| ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే | ||||
| పలుకరాదటే చిలుకా పలుకరాదటే | ||||
| చరణం: | మనసున తొణికే మమకారాలు | |||
| కనులను మెరిసే నయగారాలు | । మనసున । | |||
| తెలుపరాదటే సూటిగా, తెరలుతీసి పరిపాటిగా -2 | ||||
| పలుకరాదటే చిలుకా పలుకరాదటే | ||||
| చిలుకా.. ఆ.. ఆఆఆ… |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి