వాహనీ ప్రొడక్షంసు పతాకంపై 1966 లో విడుదలైన రాజకీయ కథా చిత్రం రంగుల రాట్నం.
VIDEO
చిత్రం:
రంగుల రాట్నం (1967)
రచన:
దాశరధి
సంగీతం:
ఎస్. రాజేశ్వరరావు, బి.గోపాలం
గానం:
ఘంటసాల, ఎస్.జానకి (తొలి
సినీ గీతం)
ప:
ఘం:
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర
దిగివచ్చునో
ఇ:
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
చ:
ఘం:
మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
జా:
మముగన్న మాయమ్మ అలివేలుమంగమ్మ
ఘం:
పతదేవు ఒడిలోన మురిసేటివేళ
జా:
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
ఘం:
విభునికి మామాట వినిపించవమ్మా
జా:
ప్రభువుకు మామనవి వినిపించవమ్మా
చ:
ఘం:
ఏడెడు శిఖరాల ననడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
జా:
అమ్మా..ఆ..ఆ... మముగన్న మాయమ్మ అలివేలుమంగా
ఆ..ఆ..ఆ..ఆ..
ఘం:
మముగన్న మాయమ్మ అలివేలుమంగా
జా:
విభునికి మా మాట వినిపించవమ్మా
ఘం:
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
చ:
ఘం:
కలవారినేగాని కరుణించలేడా
జా:
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
ఇ:
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
ఘం:
అడగవె మా తల్లి అనురాగవల్లి
జా:
అడగవె మాయమ్మ అలివేలుమంగా
ఇ:
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి