చిత్రంః వెలుగు నీడలు - 1961
రచనః కొసరాజు
సంగీతంః పెండ్యాల
గానంః ఘంటసాల, మాధవపెద్ది సత్యం, బృందం
| సాకీ: | మాధవపెద్ది: | కర్నూలు ఎక్కడా? కాకినాడెక్కడా? |
| ఏలూరు, సాలూరు, ఆలూరు ఎక్కడా..ఆ..? వరంగల్లు ఎక్కడా? | ||
| వచనం: | స్టాప్! రైల్వే గైడు చూడరా గురూ! | |
| మాధవపెద్ది: | శిష్యా! శాంతి శాంతి | |
| వాడవాడల నుండి వాలాము ఇక్కడా | ||
| లక్కా బంగారంలా అతుక్కుపోయామురా మై డియర్.. | ||
| హహ్హహా… ఆహా కరెక్ట్ | ||
| పల్లవి: | మాధవపెద్ది: | బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే |
| బృందం: | బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | |
| స్టూడెంట్ లైఫే సౌఖ్యములే, చీకూ చింతకు దూరములే | ||
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | పంపు నీళ్ళు బందైతే స్నానానికి నోచుకోము |
| మాధవపెద్ది: | గు..య్యిమని దోమలు దాడిచేస్తే శివరాత్రి జాగరణ చేస్తాము | |
| ఘంటసాల: | ఉప్పూకారంలేని హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా…ఆ..బ్రదర్ | |
| వేరొకరు: | హా! ఎన్ని కష్టాలురా నా తండ్రీ | |
| ఘంటసాల: | భయపడకురా పుత్రా! (వచనం) | |
| కష్టాలను దిగమింగేస్తాం, కలకల నవ్వుతు గడిపేస్తాం! | ||
| బృందం: | కష్టాలను దిగమింగేస్తాం కలకల నవ్వుతు గడిపేస్తాం! | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | ఇంటికిపోతే "పెళ్ళీ! పెళ్ళని" వెంటపడతారు పెద్దలు |
| మాధవపెద్ది: | పెళ్ళిజేసుకుంటే "మేమూ మేమని" పుట్టుకొస్తారు పిన్నలు | |
| ఘంటసాల: | ఈ జంఝాటంతో విద్యనాశాయ సర్వం నాశాయ నమో నమోరా బ్రదర్! | |
| మాధవపెద్ది: | హా! హతవిధీ! | |
| ఘంటసాల: | సహనం! సహనం! ఉపాయం వుంది నాయనా! (వచనం) | |
| పెళ్ళికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం! | ||
| బృందం: | పెళ్ళికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం! | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| చరణం: | ఘంటసాల: | బాధ్యతలనెన్నడూ మరచిపోరాదు |
| ప్రగతిమార్గమునెపుడూ వదలిపోరాదు | ||
| క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా బ్రదర్ | ||
| బృందం: | హియర్! హియర్! | |
| ఘంటసాల: | ఆదర్శంగా నడవాలి, అందరు భేషని పొగడాలి | |
| బృందం: | ఆదర్శంగా నడవాలి, అందరు భేషని పొగడాలి | |
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే | ||
| స్టూడెంట్ లైఫే సౌఖ్యములే, చీకూ చింతకు దూరములే | ||
| బలే బలే మంచి రోజులులే, మళ్ళీ మళ్ళీ ఇక రావులే |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి