1972 లో ఎన్.టి.రామారావు త్రిపాత్రాభినయంతో నటించిన ఎన్.టి.ఆర్. మరియు అతని సోదరుడు త్రివిక్రమరావు సంయుక్తంగా రామకృష్ణ-ఎన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన చిత్రం కులగౌరవం. ఈ చిత్రంకోసం కొసరాజు వ్రాసిన చక్కని గీతం మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం. స్త్రీ పురుషుల అనుబంధం ఎంత గొప్పదో వివరించే ఆహ్లాదకరమైన గీతమిది. సహజమైన పదప్రయోగాలతో హైందవ సంప్రదాయాలకు అద్దంపడుతూ వ్రాసిన ఈ పాట చిరకాలం నిలచి ఈనాటికీ వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది టి.జి.లింగప్ప. ఈయన ఎక్కువగా కన్నడ మరియు తమిళ చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు.
చిత్రం: | కుల గౌరవం (1972) | |
రచన: | కొసరాజు | |
సంగీతం: | టి.జి.లింగప్ప | |
గానం: | ఘంటసాల, సుశీల |
పల్లవి: | ఘంటసాల: | మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం | |
అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం | |||
చరణం: | ఘంటసాల: | స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు | |
సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు | | స్త్రీ పురుషులు | | ||
మబ్బువెంట నీరువలె, పూవునంటు తావివలె | | మబ్బువెంట | | ||
అనుసృతముగా వచ్చును ఈ సంబంధం, ఈ అనుబంధం | |||
ఆలుమగలు బ్రతుకున పండించుకున్న పరమార్ధం | | మాతృత్వం | | ||
చరణం: | సుశీల: | ప్రకృతి కాంత పురుషిని ఒడిలోన పరవశించినది | |
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నది | | ప్రకృతి కాంత | | ||
అంతా అనురాగమయం ఆనందానికి నిలయం | |||
పతి హృదయమె సతికి నిత్య సత్యమైన ఆలయం | |||
పూజించే దేవాలయం | |||
భర్తకు భార్యకు యిలలో వెలసిన దైవం, వెలసిన దైవం | |||
ఇద్దరు: | మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్ధకం | ||
అమ్మా అనిపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి