అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చిత్రం: | దీపావళి (1960) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
గానం: | ఘంటసాల | |
సంగీతం: | ఘంటసాల |
పద్యం: నరకుని రక్షింప
నరకుని రక్షింప పరివారసహితుడై నిటలాక్షుడే వచ్చి నిలచుగాక! | ||
ఆతనియానతిని కాదనలేక సురలెల్ల శివుని వెన్నంటి వచ్చెదరుగాక! | ||
గ్రహములు భయమున గతులుతప్పునుగాక! | ||
పంచభూతములు జృంభించుగాక! | ||
భూదేవియే వచ్చి పుత్రభిక్షాందేహియనుంచు చేచాచి అర్థించుగాక! | ||
సత్యధర్మాలు తప్పని జనులకతడు కలిగిన పరాభవమ్ములు సమసిపోవ | ||
నరకుని శిరంబు భూమిపైబొరలజేతు ధర్మసంస్థాపనముజేతు ధరణిలోన | ||
ఆ..ఆ..ఆ..ఆ.. |
పద్యం: సురలనుగొట్టునాడు
సురలనుగొట్టునాడు.. సురలనుగొట్టునాడు, | ||
అదితి సుందరకుండలముల్ ధరించి అచ్చరలనుబట్టునాడు | ||
చెఱసాలల మౌనుల నెట్టునాడు | ||
ఏమైంది నీ ధర్మం? | ||
మాపురమునదూరి కన్నెలను మృచ్చిలి నాపైబెట్టునాడు | ||
నీవెరుగవు ధర్మమన్న పదమే.ఏ.. | ||
నీవెరుగవు ధర్మమన్న పదమే.ఏ.. | ||
కనిపించెను నేడు నీకుగా..ఆ..ఆ.. |
కృతజ్ఞతలు: వీడియోలను యూ ట్యూబ్ లో పొందుపరచిన దివ్య మీడియా వారికి ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి