ఆచార్య ఆత్రేయ నిర్మించిన చక్కని కుటుంబకథా చిత్రం వాగ్దానం. అప్పటికే ఆత్రేయ కలం సినీక్షేత్రంలో కోలాహలం సృష్టించింది. అయితే తాను వ్రాయగలిగినా ముగ్గురు రచయితలకు తన చిత్రంకోసం పాటలు వ్రాసే అవకాశం కల్పించాడు. వారు మహాకవి శ్రీ శ్రీ, నార్ల చిరంజీవి మరియు దాశరథి. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే దాశరథికి యిది చలనచిత్ర రంగం లో తొలి అవకాశం. దాశరథి పూర్తిపేరు దాశరథి కృష్ణమాచార్య. నిజాం పాలనకు నిరసనగా తన కలంతో ఎదురించి నా తెలంగాణా కోటి రతనాల వీణ అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాడు. దాశరథి తదుపరి ఎన్నో చక్కని పాటలు ఇద్దరు మిత్రులు, దాగుడు మూతలు, మూగమనసులు వంటి చిత్రాలకు వ్రాసారు. 1961 లో వచ్చిన వాగ్దానం చిత్రంలో నా కంటిపాపలో నిలచిపోరా చక్కని యుగళగీతం. పున్నమీ - పున్నెమో, చందమామ - ఆనందసీమ, నీలితారలు - పూలదారులు వంటి సొగసైన పదాలతో ఈ గీతం ఆహ్లాదకరంగా వుంటుంది. దీనిని ఘంటసాల, సుశీల గానం చే్శారు.
చిత్రం: | వాగ్దానం (1961) | |
రచన: | దాశరథి (తొలి సినీ గీతం) | |
సంగీతం: | పెండ్యాల నాగేశ్వరరావు | |
గానం: | ఘంటసాల, సుశీల |
సుశీల: | ఊ..ఊ..ఊ….ఊ…ఊ…. | |
పల్లవి: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | |
నా కంటి పాపలో నిలిచి పోరా, నీ వెంట లోకాల గెలువనీరా | ||
ఘంటసాల: | ఆ..ఆ..ఆ…ఆ.ఆ..ఆ…..ఆఆ.ఆ…ఆ.అ.ఆ..ఆ | |
చరణం: | సుశీల: | ఈనాటీ పున్నమీ, ఏనాటీ పున్నెమో జాబిలీ వెలిగేను మనకోసమే |
ఘంటసాల: | ఆ..అహా..ఆ..ఆ.. | |
సుశీల: | ఈనాటీ పున్నమీ, ఏనాటీ పున్నెమో జాబిలీ వెలిగేను మనకోసమే | |
ఘంటసాల: | నెయ్యాలలో తలపుటుయ్యాలలో - 2, అందుకొందాము అందని ఆకాశమె | |
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | |
చరణం: | ఘంటసాల: | ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా |
సుశీల: | ఆహా..హాహా ఆ..ఆ..ఆ.. | |
ఘంటసాల: | ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా | |
సుశీల: | మేఘాలలో వలపు రాగాలలో..ఓ. -2, దూరదూరాల స్వర్గాల చేరుదమా? | |
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | |
చరణం: | సుశీల: | ఈ పూల దారులు, ఆ నీలి తారలు, తీయని స్వప్నాల తేలించగా |
ఘంటసాల: | ఆహా..హా..ఆ..ఆ. | |
సుశీల: | ఈ పూల దారులు, ఆ నీలి తారలు, తీయని స్వప్నాల తేలించగా | |
ఘంటసాల: | అందాలను, తీపి బంధాలను -2, అల్లుకొందాము డెందాలు పాలించగ | |
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా | |
ఇద్దరు: | ఆ..ఆ..ఆ..ఆఆఆ..ఆ..ఆ..ఆ…ఆ.. | |
సుశీల: | నా కంటి పాపలో నిలిచి పోరా.. నీ వెంట లోకాల గెలువనీరా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి