నిరంకుశులైన తెల్లదొరలు నియంత్రించి పాలించిన భరతావనిలో వారి అరాచకాలను నిర్భయంగా ఎదిరించాం. బానిస బ్రతుకు కన్న మరణమే శరణమనుకున్నారంతా. అందరు ఐకమత్యంతో సన్నిహితులను సంఘటపరచుకుని క్రమశిక్షణతో పోరాడినందుకు ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరి కళ్ళలోను కొంగ్రొత్త ఆశ పొడచూపింది. అయితే ఇంత కష్టపడి తెచ్చుకున్న స్వరాజ్యపు విలువలను విస్మరించాం అందరం. స్వాతంత్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అని అలనాడు మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎన్నో సహజ వనరులుండీ, ఎంతో శ్రామికశక్తి వుండీ సమైక్యత లోపించి స్వార్ధ రాజకీయాలతో మన నేతలు మనకు గోతులు తీసారు. అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం విచ్చలవిడిగా స్వైర విహారం చేసాయి. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఆశ. రేపటి రోజు బాగుంటుందేమో అని ఎదురుచూపు. దశాబ్దాల నిరంకుశ పాలన నుంచి పునః స్వతంత్రం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య దినాన మంచి భవిష్యత్తు కోసం ఆశిద్దాం. అందుకు మాస్టారి మధుర గీతం, తోలేటి రచన ఆ స్పందన ఇస్తుందని ఆశిద్దాం. అలనాటి మేటి స్వాతంత్ర్య సమర శంఖారావం ఈ పాట స్వాతంత్ర్యమె మా జన్మహక్కని చాటండి. విని ఆనందించండి.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
మూలం: | ప్రైవేట్ సాంగ్ | |
రచన: | తోలేటి | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
పల్లవి: | స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండి..(2) | |
నిరంకుశంబగు శక్తులెదిరినా నిర్భయముగ నిదురించండి (2) | ||
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమె లేదు (2) | ||
స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండీ | ||
చరణం: | కవోష్ణ రుధిర జ్వాలలతోటీ… ఈ..ఈ.. | |
కవోష్ణ రుధిర జ్వాలలతోటీ స్వతంత్ర్య సమరం నెరపండి (2) | ||
ఎంతకాలమిటు సహించియున్నా, దోపిడిమూకకు దయరాదన్నా! (2) | ||
స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండీ..ఈ..ఈ.. | ||
చరణం: | సంఘములోను ఐక్యత వేగమె సంఘట పరుచుము శాంతిపథానా..ఆ… | |
సంఘములోను ఐక్యత వేగమె సంఘట పరుచుము శాంతిపథాన | ||
స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికీ..ఈ..ఈ.. | ||
స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగల్యపు హారతులిమ్మా! | ||
మాంగల్యపు హారతులిమ్మా! | ||
స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండి..(2) |
బాగుంది సూర్యనారాయణ గారు. నేను మా నాన్నగారి పుణ్యమా అని ఘంటసాల గారి గళ మాధుర్యాన్ని మొదటిదారి తెలుసుకున్నపాట - అప్పుడు మొదలైన మైకం ఇంకా దిగలేదు.
రిప్లయితొలగించండిఈ పాట సంవత్సరం రాశారో తెలియజేయగలరా?
రిప్లయితొలగించండిచాలా బాగుంది.. ఘంటసాల గారు తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసారు..తన దేశభక్తిని ఈనాటికీ గుర్తుచేసుకుంటున్న తరం మనది.. ధన్యవాదాలు సూర్యనారాయణ గారూ..
రిప్లయితొలగించండి