తెనాలి రామకృష్ణుడు చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వికటకవి. విజయనగర
సామ్రాజ్యపు కవన, సాహిత్య వేదికయైన భువనవిజయంలోని అష్టదిగ్గజాలలో ఒకడైన ఆతనికి ఒక ప్రత్యేకమైన
స్థానం వుంది. ఒక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలను శ్లాఘిస్తూ ఒక పద్యం
చెబుతాడు. ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయల కీర్తిని
స్వచ్ఛతకు ప్రతీకయైన శ్వేత వర్ణం (తెలుపు రంగు) తో పరోక్షంగా వ్యక్తి,
వస్తు, వాహన విశేషాల ఉపమానాలుపయోగించి ఆరు అంశాలతో పోలుస్తూ వర్ణిస్తాడు.
అదెలాగంటే, నరసింహ కృష్ణరాయల - నరసింహ రాయల కుమారుడైన కృష్ణ దేవరాయల
(తండ్రి పేరును తనయుని పేరుకు జతచేసి చెప్పడం దక్షిణాదిన ఒక ఆనవాయితీ
కదా!) అపూర్వమైన కీర్తి ఎలా
ఒప్పిందంటే - "కరిభిద్గిరిభిత్కరి కరిభిద్గిరి గిరిభిత్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబౌ" అని. ఇందులోని తెలుపు రంగును గలిగిన ఆరు అంశాలు పదచ్ఛేదనం చేస్తే - కరిభిత్
(1) + గిరిభిత్-కరి (2) + కరిభిత్-గిరి (3) + గిరిభిత్ (4) + కరిభిత్
గిరిభిత్ తురంగ అంటే కరిభిత్ తురంగ (5) మరియు గిరిభిత్ తురంగ (6).
వీటి అర్ధం - 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క) గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు తెల్లగా వుంటాడు; 2. గిరిభిత్ కరి - గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు - ఐరావతం తెల్లనిది; 3. కరిభిత్ గిరి - కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది; 4. గిరిభిత్ - తెల్లనైన తళుకుమనే వజ్రాయుధం; 5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును); 6. గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; . ఆవిధంగా - శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి), వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు (కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి రామకృష్ణ కవి భావము.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
పద్యం: తెనాలి రామకృష్ణ
సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
కృతజ్ఞతలు: ఈ విశేషాలను 'తురుపుముక్క' బ్లాగు కవితాభిషేకం-4 నుండి సేకరించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విశేషాలు చదువుతుంటే మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అది మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. దృశ్యఖండికను యూ టూబ్ లో సమకూర్చిన అన్వితా రాం కు ధన్యవాదములు.
వీటి అర్ధం - 1. కరిభిత్ = శివుడు (కరి = ఏనుగు; భిత్ = తునక లేక ముక్క) గజాసురుడు అనే కరి రూపుగల రాక్షసుడ్ని ముక్కలు చేసినవాడు అయిన శివుడు తెల్లగా వుంటాడు; 2. గిరిభిత్ కరి - గిరుల రెక్కలు త్రుంచిన ఇంద్రుని యొక్క ఏనుగు - ఐరావతం తెల్లనిది; 3. కరిభిత్ గిరి - కరిభిత్ అంటే శివుడు, కరిభిత్ గిరి అంటే శివుని కొండ లేక ధవళగిరి తెల్లనిది; 4. గిరిభిత్ - తెల్లనైన తళుకుమనే వజ్రాయుధం; 5. కరిభిత్ తురంగము అంటే శివుని వాహనము అయిన నంది తెల్లనిది (తురంగము అంటే గుఱ్ఱమైనప్పటికీ వాహనము అన్న అర్ధంలో కూడ తీసుకోవచ్చును. అందువలన శివునికి వాహనము అని అనుకోవచ్చును); 6. గిరిభిత్ తురంగము అంటే గిరుల రెక్కలను ఖండించిన ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవము కూడ తెల్లనిది; . ఆవిధంగా - శివుడు (కరిభిత్), ఐరావతం (గిరిభిత్ కరి), వెండి కొండ (కరిభిత్ గిరి), వజ్రాయుధం (గిరిభిత్), నందీశ్వరుడు (కరిభిత్తురంగము) మరియు ఉచ్ఛైశ్రవము (గిరిభిత్తురంగము) అన్నీ తెల్లనివే. తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, చైతన్యానికి ప్రతీక. ఆవిధంగా శ్రీ కృష్ణదేవరాయల అపూర్వమైన కీర్తి స్వచ్ఛతకు చిహ్నమై తెల్లగా వున్నదని తెనాలి రామకృష్ణ కవి భావము.
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
పద్యం: తెనాలి రామకృష్ణ
సంగీతం: విశ్వనాథన్-రామ్మూర్తి
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు
నరసింహ కృష్ణ రాయల
కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిత్గిరిభిత్తురంగ కమనీయంబై!కృతజ్ఞతలు: ఈ విశేషాలను 'తురుపుముక్క' బ్లాగు కవితాభిషేకం-4 నుండి సేకరించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విశేషాలు చదువుతుంటే మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అది మీతో ఇక్కడ పంచుకుంటున్నాను. దృశ్యఖండికను యూ టూబ్ లో సమకూర్చిన అన్వితా రాం కు ధన్యవాదములు.
చాలా బావుంది. చిన్నప్పుడు సినిమాలో చూసినది మస్తిష్కంలో అలా ఉండిపోయింది. ఇవాళ్ళ వెలికికి తీసారు మీరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాలా బావుంది. చిన్నప్పుడు సినిమాలో చూసినది మస్తిష్కంలో అలా ఉండిపోయింది. ఇవాళ్ళ వెలికికి తీసారు మీరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాలా బావుంది. చిన్నప్పుడు సినిమాలో చూసినది మస్తిష్కంలో అలా ఉండిపోయింది. ఇవాళ్ళ వెలికికి తీసారు మీరు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపద్యార్థాన్ని అందించినందుకు ధన్యవాదాలు. కాని ఐదవ అంశంలో "కరిభిత్ తురంగము" అని (రామకృష్ణుడు) చదవలేదు కదా? "1.కరిభిత్ 2.గిరిభిత్ కరి 3.కరిభిత్ గిరి 4.గిరిభిత్ 5.కరిభిత్ 6.గిరిభిత్తురంగ కమనీయంబై" అనే చదివాడు. గమనించగలరు.
రిప్లయితొలగించండికెకె గారికి, నమస్కారములు. మీ స్పందనకు ధన్యవాదములు. మీరు చెప్పింది నిజమే. నేను కూడ ఆ ఉద్దేశంతోనె వివరణ యిచ్చాను. రామకృష్ణుడు విడిగా చెప్పాడని కాదు నా ఉద్దేశము. వాటిని విడదీసి తురంగము అనేది కరిభిత్ కు మరియు గిరిభిత్ కు అన్వయించుకోవాలని విశదీకరించాను.
తొలగించండికెకె గారు, ధన్యవాదములు. మీరు చెప్పింది నిజమే. అయితే తురంగము కరిభిత్ కు మరియు గిరిభిత్ కు కూడ అన్వయించవలసి ఉంటుందని ఆ పదమును రెండిటికీ చేర్చి వివరించడం జరిగింది. అది పొరపాటు కాదు. వివరణ కోసం చేసిన పదవిచ్ఛేదన అని గమనించగలరు. నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివిశ్లేషణ తో మీరు సమర్పించిన పద్యం ఎంతో చక్కగా ఉంది.
రిప్లయితొలగించండిమీకున్న పరిజ్ఞానం అమోఘం . ఇలా మీకు తెలిసిన విషయం
మాకు చెప్పినందులకు ధన్యవాదాలు ..వెంకోబ రావు
వెంకోబా రావు గారు. మీకు ఈ పద్యం నచ్చినందుకు సంతోషం. అందులో నా ప్రతిభ ఏమీ లేదు. నేను సూచించిన తురుఫు ముక్క బ్లాగు నుండి గ్రహించి నా స్వంత మాటలలో వ్రాసాను. ఆ రచయిత ఎవరో వారికి బహుళ ధన్యవాదాలు. అయితే మీరన్న ఆఖరి మాట నిజం. నాకు తెలిసిన ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలని చిన్న తపన. అంతే. శోధించి కొత్త విషయాలు తెలుసుకుని ఘంటసాల మాస్టారి పద్యాలకు, పాటలకు అవి వ్రాసిన కవులు రచయితలను గుర్తు చేసుకోవాలని నా ఆశ. శలవు.
తొలగించండిIt is our luck & it is our purva janma Sukrutam ---- Telugu Bhoomi lo Puttadam - Anduna Ghantasala Garri patalu Vinadam... Kadupulo AAkalito Maadutunna, Dahamto Dappika Teerakunna.... Ekkadinumcho Duramga A Mahanubhavuni teeyanaina paata Vinipistumte - AAkali - Dahamu Matumayamavutayi kadaaaa....
రిప్లయితొలగించండిMaro Janma amtu Umte EE Telugu Bhoomi Meedane Putti Imka 60 samvatsaralu Kaadu 600 samvatsaralaina AAAAA Mahaneeyuni Paatalu Vinali, Jeevitam Tarimchali.... As I have worked at Mumbai for 34 years I heard the music of allprominent Hindi Singers .
As by birth I am a Telugu man I heard the great Singer's voices of all... Ghantasala Garu.... Gana Gandharva,
Ganamlo Tanaku Tane Meti... IN ONE WORD... HE IS KARANA JANMUDU>>>>>>>
Every House should be decorated with his photo......... NO WORDS TO SAY.....
శ్రీరామ చంద్రమూర్తి గారు, మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. మాస్టారు కారణజన్ములు. అటువంటి గాయకుడు న భూతో న భవిష్యతి.
తొలగించండి