రాజ్యం పిక్చర్సు పతాకంపై 1963 లో శ్రీమదాంధ్ర మహాభారతము లోని విరాటపర్వం ఆధారంగా 'పౌరాణిక బ్రహ్మ' కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన నర్తనశాల చిత్రం ఒక మహోన్నతమైన దృశ్యకావ్యం. ఈ చిత్రం పేరు తలవగనే మనకు స్ఫురించేవి చక్కని పద్యాలు, పాటలు, వాటిని తెలుగువారికి చిరస్థాయిగా నిలిచేటట్టు అందించిన మహామహులు సుస్వర సుసర్ల దక్షిణామూర్తి మన హృదయ ఫలకం పై ప్రత్యక్షమౌతారు. పద్యానికి వన్నెతెచ్చిన మధుర గాయకుడు ఘంటసాల పౌరాణికాలకు ఎంతో ఘనత తెచ్చి ఆ చిత్రాలు మనకు మైలురాళ్ళు గా నిలిపాడు. తిక్కన సోమయాజి రచించిన ఈ పద్యము వెనుకగల కధాసంగ్రహాన్ని చీమలమర్రి బృందావనరావు గారు "నాకు నచ్చిన పద్యం" అనే శీర్షికన "ఈ మాట" వెబ్ జైన్ లో వివరంగా వ్రాసారు. ధర్మరాజు గొప్పదనాన్ని బృహన్నల (అర్జునుడు) వలలునికి (భీముడు), సైరంధ్రి (ద్రౌపది) కి వివరించే పద్యాన్ని యధాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. అయితే సౌలభ్యం కోసం పద విచ్ఛేదనతో ఘంటసాల గానం చేసిన పద్య ఖండికను కూడ దిగువన చూడగలరు. బృహన్నల గా ఎన్.టి.రామారావు, వలలునిగా దండమూడి రాజగోపాల రావు, ద్రౌపదిగా సావిత్రి నటించారు.
కృతజ్ఞతలు: పద్యము యొక్క వివరాలు పొందుపరచిన ఈ మాట వారికి, రచయిత చీమలమర్రి బృందావనరావు గారికి, యూ ట్యూబ్ విడియోను అందించిన తెలుగు వన్ వారికి, చిత్ర సమాచారమును అందించిన వికిపీడియా వారికి ధన్యవాదములు.
ఆడియో మూలం: వీడియో నుండి
పద్యం యథాతథంగా:
సీ. | ఎవ్వని వాకిట నిభమద పంకంబు | |
రాజభూషణ రజో రాజి నడఁగు | ||
ఎవ్వని చారిత్ర మెల్ల లోకములకు | ||
నొజ్జయై వినయంబు నొరపు గఱపు | ||
నెవ్వని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి | ||
మానిత సంపద లీనుచుండు | ||
నెవ్వని గుణలత లేడు వారాసుల | ||
కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు | ||
తే.గీ. | నతడు భూరిప్రతాప, మహా ప్రదీప | |
దూర విఘటిత గర్వాంధకార వైరి | ||
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి | ||
తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు |
పద్యం పదసౌలభ్యంతో మాస్టారు పాడిన విధం:
సీ. | ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు | |
రాజభూషణ రజో రాజి నడఁగు | ||
ఎవ్వాని చారిత్ర మెల్ల లోకములకు | ||
ఒజ్జయై వినయంబు నొరపు గఱపు | ||
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి | ||
మానిత సంపద లీనుచుండు..ఊ.. | ||
ఎవ్వాని గుణలత లేడు వారాసుల | ||
కడపటి కొండపైఁ కలయ బ్రాఁకు | ||
తే.గీ. | అతడు భూరిప్రతాప, మహా ప్రదీప | |
దూర విఘటిత గర్వాంధకార వైరి | ||
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి | ||
తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు | ||
ఆ..ఆ..ఆ…ఆ..ఆ |
కృతజ్ఞతలు: పద్యము యొక్క వివరాలు పొందుపరచిన ఈ మాట వారికి, రచయిత చీమలమర్రి బృందావనరావు గారికి, యూ ట్యూబ్ విడియోను అందించిన తెలుగు వన్ వారికి, చిత్ర సమాచారమును అందించిన వికిపీడియా వారికి ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి