తెలుగువారికి అత్తగారు అంటే వెంటనే గుర్తుకొచ్చేది గయ్యాళి గడుగ్గాయి, మరెవరు సూర్యకాంతం.ఒకసారి ప్రముఖ నటుడు గుమ్మడి సూర్యకాంతంతో "నువ్వు తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసావు, నీ పేరు ఎవ్వరూ పెట్టుకోనీకుండా చేసావు" అని నవ్వుతూ అన్నారట. నిజమే ఆ పేరు మళ్ళా వినబడలేదు. అలాంటి నటి మళ్ళీ పుట్టలేదు. అయితే పాపం నిజజీవితంలో ఆవిడ స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం. కోడళ్ళను అదిలించి, అదిరించి, అందలమెక్కి అడ్డమైన చాకిరీ చేయించుకునే అత్తగారి పాత్రలకు నిర్వచనం నటి సూర్యకాంతం అన్నది నిర్వివాదాంశం. చిత్రసీమలో ఎందరో నటీమణులు వచ్చారు. అయితే ఇలాంటి అత్తగారి పాత్రకు మరొకరు న్యాయం చేయగలగడం కాని, మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోవడం గాని దుర్లభం. బహుశ అందుకే గుండమ్మ కథ చిత్రాన్ని మళ్ళా నిర్మించలేకపోయారు. అత్తాకోడళ్ళ నేపధ్యంలో 1958 లో జగ్గయ్య, రమణమూర్తి, దేవిక, గిరిజ, సూర్యకాంతం నటించిన, అనుపమా వారి పతాకం పై కె.బి.తిలక్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'అత్తా ఒకింటి కోడలే. ఈ చిత్రంకోసం ఆహ్లాదకరమైన ఆరుద్ర పాటకు పెండ్యాల స్వరకల్పన చేశారు. దీనిని ఘంటసాల, సుశీల గానం చేశారు.
వీడియో మూలం: ఘంటసాల గానామృతం
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: | అత్తా ఒకింటి కోడలే (1958) | |
రచన: | ఆరుద్ర | |
గానం: | ఘంటసాల, పి.సుశీల | |
సంగీతం: | పెండ్యాల నాగేశ్వర రావు | |
ఆలాపన: | ఘంటసాల: | హా…హహహహా.. అహహా..హహహహా... |
సుశీల: | ఆ..ఆ..ఆ…ఆ..ఆఆఆఆ… | |
పల్లవి: | ఘంటసాల: | నాలో కలిగినది అది యేమో యేమో |
మధురభావం నాలో.ఓ. కలిగినది | ||
ఆలాపన: | సుశీల: | హా…హహహహా.. అహహా..హహహహా... |
ఆ..ఆ..ఆ…ఆ..ఆఆఆఆ… | ||
చరణం: | పెదవి దాటి మాటలు రావు బెదరిపోతాయీ..ఈ..ఈ.. | |
పెదవి దాటి మాటలు రావు బెదరిపోతాయి | ||
ఘంటసాల: | ఆ..ఆ..హృదయములో విరితేనెల తేలిన | |
హృదయములో విరితేనెల తేలిన | ||
ఊహలు రేగాయీ..ఈ..ఈ.. నాలో కలిగినది | ||
నాలో కలిగినది అది యేమో యేమో | ||
మధురభావం నాలో.ఓ. కలిగినది | ||
చరణం: | ఘంటసాల: | కనుల ముందు కమ్మని ఆశలు కలకలమన్నాయీ..ఈ |
కనుల ముందు కమ్మని ఆశలు కలకలమన్నాయి | ||
సుశీల: | ఆ..మనసుపడే మన ప్రేమ లతాళి | |
మనసుపడే మన ప్రేమ లతాళి పూవులు పూసింది | ||
నాలో కలిగినది అది యేమో యేమో | ||
మధురభావం నాలో.ఓ. కలిగినది | ||
చరణం: | ఘంటసాల: | కలువరించే కలలు పండే శుభదినముదయించే..ఏ..ఏ.. |
కలువరించే కలలు పండే శుభదినముదయించే.. | ||
సుశీల: | ఆ..కల నిజమై ఒడి నిండుగ తీయని కోరిక ఫలియించే..ఏ.. | |
ఇద్దరు: | నాలో కలిగినది అది యేమో యేమో | |
మధురభావం నాలో.ఓ. కలిగినది | ||
హా…హహహహా.. అహహా..హహహహా... | ||
ఆ..ఆ..ఆ…ఆ..ఆఆఆఆ… | ||
హూ..హూ..హుహుహూ | ||
హూ..హూ..హుహుహూ | ||
హూ..హూ..హుహుహూ |
కృతజ్ఞతలు: సమాచారాన్ని అందించిన ఘంటసాల గళామృతము బ్లాగుకు, శ్రవణ ఖండికను పొందుపరచిన ఘంటసాల గాన చరితకు, అదనపు సమాచారము పొందుపరచిన వికిపీడియా వారికి, పోస్టరును పొందుపరచిన రాగ.కాం వారికి ధన్యవాదములు.
ఒక మధురమైన పాటని అందించినందుకు ధన్యవాదాలు. వీడియో ఉంటే అందించగలరు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు అచ్యుత ప్రసాద్ గారు. వీడియో లభించలేదు.
తొలగించండిచక్కటి గీతాన్ని అందించారు. ఇది పాత పాటైనా మొదటి సారి వినటంతో కొత్తగా ఉంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సుబ్బారావు గారు. పాతదైనా ఆపా(ట)త మధురం మరి.
తొలగించండిఒక మంచి పాట, ధన్యవాదాలు సూర్యనారాయణగారు. ఈ పాటని మొదటిసారి www.ghantasala.info ద్వారానే విన్నాను. ఇది బాగేశ్రీ రాగం అని ఎక్కడో చదివేను. ఈ రాగం ’నీ కోసమె నే జీవించునది’, ’మంటలు రేపే నెలరాజ’ వంటి విషాద గీతాలకే కాకుండా ఇలాంటి ఆహ్లాదమైన గీతాలకు కూడా చాలా బాగా నప్పుతుంది. ఈ రాగంలో తెలుగు, హింది సినిమా పాటలు ఎన్నో ఉన్నాయి.
రిప్లయితొలగించండిరామ ప్రసాద్