స్వభావ పరంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావ కవి. హృధయ స్పందనలోని భావుకతను సహజమైన, సరళమైన మాటలలో నింపి తన పాటలను, గేయాలను మనకు అందించారు. కవన పటిమలో ఆయన ఆంధ్రా షెల్లీ గా ప్రఖ్యాతి పొందారు. చలనచిత్ర రంగంలో తొల్దొలుత మల్లిపై మల్లీశ్వరిలో, మల్లెల వేళకు వెన్నెల మాసానికి సుఖదుఃఖాలలో ఆయన అందించిన పాటలు మరపురానివి. 1968 లో విడుదలైన అమాయకుడు చిత్రం కోసం మనిషికి మనసుకు గల సంబంధాన్ని కరుణతో నింపి జీవిత ప్రయాణంలో మనిషి పయనం ఎలా సాగుతుందో చక్కగా వివరించారు "మనిషైతే మనసుంటే కరుణ కరగాలిరా" పాటలో. ఈ చిత్రానికి సంగీతం బి.శంకర్, గానం ఘంటసాల. ఈ చిత్రంలోనిదే మరొక చక్కని యుగళగీతం ఘంటసాల, సుశీల పాడిన "చందమామ రమ్మంది చూడు".
Thanks to Sreeni Dasari for uploading the video clip to You Tube
చిత్రం: | అమాయకుడు (1968) | |
రచన: | దేవులపల్లి కృష్ణశాస్త్రి | |
సంగీతం: | బి. శంకర్ | |
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | |
పల్లవి: | మనిషైతే…. మనసుంటే…. | |
మనిషైతే, మనసుంటే, కనులు కరగాలిరా | ||
కరిగి కరుణ కురియాలిరా, కురిసి, జగతి నిండాలిరా | ||
చరణం: | ఆగి ఆగి సాగిపోరా, సాగి పోతూ చూడరా ఆ., | |
ఆగి ఆగి సాగిపోరా, సాగి పోతూ చూడరా | ||
వేగిపోయేవెన్నెన్ని బ్రతుకులో, | ||
వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో, వేచియున్నాయిరా | ||
మనిషైతే, మనసుంటే, | ||
మనిషైతే, మనసుంటే, కనులు కరగాలిరా | ||
కరిగి కరుణ కురియాలిరా, కురిసి, జగతి నిండాలిరా | ||
చరణం: | తేలిపోతూ నీలి మేఘం జాలి జాలిగా కరిగెరా..ఆ | |
తేలిపోతూ నీలి మేఘం జాలీ జాలిగ కరిగెరా, | ||
కేలు చాపి ఆ దైవమే తన, కేలు చాపి ఆకాశమే ఈ నేలపై ఒరిగెరా | ||
మనిషైతే, మనసుంటే, | ||
మనసుంటే, మనిషైతే | ||
వైకుంఠమే ఒరుగురా, నీ కోసమే కరుగురా | ||
నీ కోసమే కరుగురా, నీ కోసమే కరుగురా | ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి