ప్రతిష్టాత్మకైన చిత్ర నిర్మాణ సంస్థ ఎ.వి.ఎమ్. (ఎ.వి.మెయ్యప్పన్) నిర్మించిన భక్తిరస చిత్రం భూకైలాస్ (1958). ముగ్గురు అగ్రనాయకులు - ఎన్.టి.ఆర్. (రావణుడు), ఎ.ఎన్.ఆర్. (నారదుడు) మరియు ఎస్.వి.ఆర్. (మయాసురుడు) లు నటించిన ఈ చిత్రం లో జమున మండోదరి గా, బి.సరోజా దేవి పార్వతిగా నటించారు. రావణాసురుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని వరంగా పొంది లంకకు బయలుదేరుతాడు. దానిని అతనికి దక్కకుండా గణపతి అడ్డుకుని నేలపై మోపి లంక చేరకుండ సఫలీకృతుడవుతాడు. ఆ శివలింగం ప్రతిష్టించబడిన స్థలమే భూకైలాసం గా పేరు పొందుతుంది. ఈ చిత్రానికి సంగీతం ఇద్దరు అన్నదమ్ములు ఆర్.సుదర్శనం మరియు ఆర్.గోవర్ధనం సమకూర్చారు. అన్ని పాటలూ సూపర్ హిట్టే. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు శివునిపై చక్కని పాటలు - దేవదేవ ధవళాచల మందిర, నీలకంధరా దేవా! మొదలయినవి, ఎన్నో చక్కని పద్యాలు గాగానం చేశారు.
| చిత్రం: | భూకైలాస్ (1958) | ||
| రచన: | సముద్రాల రాఘవాచార్య (సీనియర్) | ||
| సంగీతం: | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం | ||
| గానం: | ఘంటసాల | ||
| సాకీ: | జయ జయ మహాదేవ శంభో సదాశివా... | ||
| ఆశ్రిత మందారా శృతిశిఖర సంచారా... | |||
| పల్లవి: | నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | | నీలకంధరా| | |
| సత్యసుందరా స్వామీ, నిత్యనిర్మలా పాహీ | | సత్యసుందరా | | ||
| నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | |||
| చరణం: | అన్యదైవము గొలువా...ఆ..ఆ..ఆ..ఆ.. | ||
| అన్యదైవము గొలువా నీదుపాదము విడువా | | అన్య దైవమూ | | ||
| దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా | | దర్శనమ్ము | | ||
| నీలకంధరా దేవా! దీనబాంధవా రారా! నన్నుగావరా | |||
| చరణం: | దేహియన వరములిడు దానగుణసీమా | ||
| పాహియన్నను ముక్తినిడు పరంధామా | |||
| నీమమున నీ దివ్యనామ సంస్మరణా | |||
| ఏమరక చేయుదును భవతాపహరణా | |||
| నీ దయామయ దృష్టి దురితమ్ములారా | |||
| వరసుధావృష్టి నా వాంఛలీడేరా | |||
| కరుణించు పరమేశ దరహాసభాసా | |||
| హరహర మహాదేవ కైలాసవాసా… కైలాసవాసా.. | |||
| చరణం: | ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా | ||
| నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా | | ఫాలలోచన | | ||
| కన్నులనిండుగ భక్తవత్సల కానగ రావయ్యా | | కన్నుల | | ||
| ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా | | ప్రేమమీర | | ||
| ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా | |||
| నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా | |||
| శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా - 3 |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి