సుప్రసిద్ధ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన విజేత నవల ఆధారంగా 1972 లో వాణిశ్రీ, ఎ.ఎన్.ఆర్., నాయికా నాయకులుగా నటించగా అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్సు పతాకంపై నిర్మించిన చిత్రం విచిత్రబంధం. ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారిన మరొక కలికితురాయి, కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం లో ఘంటసాల, సుశీల పాడిన చీకటి వెలుగుల రంగేళీ బహుకాలం గుర్తుండే చక్కని పాట. ఈ చిత్రానికి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. ఎస్.వి.ఆర్., అంజలి, గుమ్మడి యితర తారాగణం. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి అయిదు పాటలు పాడారు.
Thanks to Telugu One for providing the Video and You Tube for sharing the video.
| చిత్రం: | విచిత్రబంధం (1972) | ||
| రచన: | ఆచార్య ఆత్రేయ | ||
| సంగీతం: | కె.వి.మహదేవన్ | ||
| గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
| పల్లవి: | సుశీల: | చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి | | చీకటి వెలుగుల | |
| మన జీవితమే ఒక దీపావళి | |||
| ఘంటసాల: | అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల | ||
| ఆశల వెలిగించు దీపాల వెల్లి | | చీకటి వెలుగుల | | ||
| ఇద్దరు: | చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి | ||
| మన జీవితమే ఒక దీపావళి | |||
| చరణం: | సుశీల: | అక్కయ్య కన్నుల్లో మతాబులు | |
| ఘంటసాల: | ఏ చక్కన్ని బావకో జవాబులు | ||
| సుశీల: | అక్కయ్య కన్నుల్లో మతాబులు | ||
| ఘంటసాల: | ఏ చక్కన్ని బావకో జవాబులు | ||
| మాటల్లో వినిపించు చిటపటలు | | మాటల్లో | | ||
| సుశీల: | ఏ మనసునో కవ్వించు గుసగుసలు | ||
| లా లా లా | |||
| ఘంటసాల: | ఆహా హా హా | ||
| ఇద్దరు: | ఆ..ఆ..ఆ..ఆ.. | | చీకటి వెలుగుల | | |
| చరణం: | ఘంటసాల: | అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు | |
| సుశీల: | మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు | ||
| ఘంటసాల: | అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు | ||
| సుశీల: | మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు | ||
| బావా బావా పన్నీరు, బావను పట్టుక తన్నేరు | | బావా బావా | | ||
| వీధి వీధి తిప్పేరు, వీసెడు గుద్దులు గుద్దేరు | |||
| అందరు: | అహ్హ హ్హ హ్హ హా | | చీకటి వెలుగుల | | |
| చరణం: | ఘంటసాల: | అమ్మాయి పుట్టింది అమాస నాడు | |
| అసలైన గజదొంగ అవుతుంది చూడు | | అమ్మాయి | | ||
| పుట్టినరోజున దొరికాడు తోడు (2) | | పుట్టిన రోజున | | ||
| పున్నమి నాటికి అవుతాడు జోడు | |||
| సుశీల: | ఆహా హా హా | ||
| ఘంటసాల: | ఆహా హా హా | ||
| ఇద్దరు: | ఆ..ఆ..ఆ.. | | చీకటి వెలుగుల | |


మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు నాగేంద్ర గారు. మీకు, మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.
తొలగించండిసూరి గారూ ! మీకూ మీ కుటుంభసభ్యులకూ దీపావళి సుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిధన్యవాదాలు ఫణీ. నీకు, శారద గారికి, చి.కార్తీక్, చి.శార్ఘ్య లకు మీ అమ్మ గారికి దీపావళి శుభాకాంక్షలు.
తొలగించండిహలో అండీ !!
రిప్లయితొలగించండి''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
ధన్యవాదాలు. మీకు, మీ పరివారానికి దీపావళి శుభాకాంక్షలు. అలాగే జత చేయండి.
తొలగించండి