1956 లో జూపిటర్ పిక్చర్స్ పతాకం పై విడుదలయిన జానపద, భక్తి చిత్రం ఉమా సుందరి. ఇందులో ఎన్ .టి.ఆర్., జూనియర్ శ్రీరంజని నటించారు. చిత్తూరు వి..నాగయ్య, కన్నాంబ, రేలంగి, సురభి బాల సరస్వతి ఇతర తారాగణం. సంగీతం అశ్వద్ధామ. పాటలు పద్యాలు సదాశివ బ్రహ్మం రచన. దర్శకత్వం పి.పుల్లయ్య. ఈ చిత్రంలో నాగభూషణం మరియు ఎన్.టి.ఆర్.లపై చిత్రీకరించిన ఒక వేదాంత గీతాన్ని అలనాటి ప్రముఖ హాస్య గాయకులు పిఠాపురం నాగేశ్వర రావు, ఘంటసాల మాస్టారు పాడారు. వీరిద్దరూ కలసి పాడినవి ఏడు పాటలు. అందులో అవేకళ్ళు, దసరా బుల్లోడు చిత్రాల లో రెండు-మూడున్నాయి. ఉమా సుందరి చిత్రంలో వీర రాయల మహారాజు (ఎన్.టి.ఆర్.) కరువు కాటకాలతో దేశం దుర్భిక్షం కాగా, రాజ్యం వదలి అడవులపాలవుతాడు. పరమ శివుడు (నాగభూషణం) ఒక పిచ్చివాడి వేషంలో అతనికి తారస పడతాడు. వారిరువురి మధ్య సాగిన తత్వ సారమే ఈ పాట. ఈ పాత్రలో నాగభూషణం నటన అపూర్వం. ఈ చిత్రంలో మాస్టారు కొన్ని పద్యాలు కూడా పాడారు. ఈ చిత్రాన్ని ఈ లింకులో చూడవచ్చును.
చిత్రం: | ఉమా సుందరి (1956) | |
రచన: | సదాశివ బ్రహ్మం | |
సంగీతం: | అశ్వద్దామ | |
గానం: | ఘంటసాల, పిఠాపురం | |
పల్లవి: | పిఠాపురం: | నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా |
తోలు బొమ్మలురా జీవా..ఆ..ఆ.. | ||
ఘంటసాల: | నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా | |
తోలు బొమ్మలురా జీవా..ఆ..ఆ.. | ||
పిఠాపురం: | సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా.. | |
ఘంటసాల: | శివ సాన్నిధ్యమురా జీవా | |
పిఠాపురం: | సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా.. | |
ఘంటసాల: | శివ సాన్నిధ్యమురా జీవా | |
చరణం: | పిఠాపురం: | ఘోర దురిత సంసార జలధిలో జ్ఞానమె చేయూత |
అజ్ఞానమె ఎదురీత ఆ..ఆ.. | ||
ఘంటసాల: | జీవా.. జ్ఞానమె చేయూత అజ్ఞానమె ఎదురీత ఆ..ఆ.. | |
పిఠాపురం: | ఘోర దురిత సంసార జలధిలో జ్ఞానమె చేయూత | |
అజ్ఞానమె ఎదురీత ఆ..ఆ.. | ||
ఘంటసాల: | జీవా.. జ్ఞానమె చేయూత అజ్ఞానమె ఎదురీత ఆ..ఆ.. | |
చరణం: | పిఠాపురం: | మోహమెందుకీ దేహము పై ఇది తోలు తిత్తిరా జీవా.. |
ఉత్త గాలి తిత్తిరా జీవా.. | ||
ఘంటసాల: | మోహమెందుకీ దేహము పై ఇది తోలు తిత్తిరా జీవా.. | |
ఉత్త గాలి తిత్తిరా జీవా.. | ||
ఇద్దరు: | నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా | |
తోలు బొమ్మలురా జీవా..ఆ..ఆ.. |
Thanks to "Tollywood for providing the you tube video. Thanks to Sri Someswararao Bollapragada for providing the poster of the movie. Also, thanks to wikipedia for the information.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి