ఘంటసాల మాస్టారి పాటలు వింటూ వుంటే వచ్చే ఆనందం వర్ణనాతీతం. అయితే ఆ పాటలు పుట్టిన వివరాలు తెలుసుకుంటే ఇంకా ఆ ఆనందం ద్విగుణం, బహుగుణం అవుతుంది. గత సంవత్సరం (2011) ఫిబ్రవరి లో మా టీవీ వారు నిర్వహించిన ఘంటసాల గీతావధానం చాల ఆసక్తి కరంగా జరిగింది. ఇది ఒక నూతన ప్రక్రియ. దీనిని ప్రముఖ సినీకవి వెన్నెలకంటి గారు, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు నిర్వహించారు. ముఖ్యంగా వెన్నెలకంటి గారు పాటల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఆసక్తికరమైన కొంత వివరణ యిచ్చారు. ఇందులో ఆరుగురు పృచ్ఛకులు పాల్గొన్నారు. ఒక ప్రక్క ముగ్గురు రచయితలు (పరుచూరి, భాస్కరభట్ల, రామ జోగయ్య శాస్త్రి), మరొక ప్రక్క ముగ్గురు గాయకులు (ఆర్.పి.పట్నాయక్, మాళవిక, హేమచందర్). అయితే ఇందులో పరుచూరి గోపాలకృష్ణ గారు నట-రచయితలు, ఆర్.పి.పట్నాయక్ గారు గాయక-సంగీత దర్శకులుగా అందరికీ చిర పరిచితులు. పృచ్ఛకులు మాస్టారు సినిమాలకు పాడిన పాటల నుండి ఒకటి రెండు పంక్తులు గాని, ప్రశ్న గాని అడిగారు. దానికి వెన్నెల కంటి గారు సమాధానం వివరణతో, కొన్ని వీడియో క్లిప్పింగులతో చెప్పారు. చాల ఆసక్తికరంగా జరిగింది ఈ గీతావధానం. ఇది మాస్టారి అభిమానులందరికీ నచ్చుతుందని తలుస్తాను.
కృతజ్ఞతలు: ఈ యూ ట్యూబ్ వీడియోను అందించిన "మా TV" వారికి
పంచినందుకు ధన్యవాదాలు సూరి గారూ !
రిప్లయితొలగించండిస్వాగతం.
తొలగించండి