సంఘంలో పెద్దమనుషులు గా చలామణి అవుతున్న వ్యక్తులు తెర వెనుక ఎన్ని అన్యాయాలు, ఘోరాలు చేస్తుంటారో చూపించే వ్యంగ్య (సెటైర్) చిత్రం "పెద్ద మనుషులు" ఈ చిత్రంలో రేలంగి గారిది ఒక కీలకమైన పాత్ర. ప్రధాన ప్రతినాయకుడైన గ్రామ సర్పంచ్ (శ్రీ జంద్యాల గౌరీనాథ శాస్త్రి గారు) కు తమ్ముడు "తిక్క శంకరయ్య" గా నటించిన రేలంగి అన్న ఆగడాలను నిరసిస్తూ, పిచ్చి వాడిలాగా తిరుగుతుంటాడు. పెద్ద మనుషులు చిత్రానికి శ్రీ ఘంటసాల గారు రెండు చక్కని పాటలు పాడారు. ఇంతకు ముందు పోస్టులో "నందామయా గురుడ నందామయా" చూసారు. ఈ చిత్రంలో మరొక అద్భుతమైన వ్యంగ్య రచన శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసారు. భక్తి పాటలాగ అనిపించే ఈ పాట నిజానికి "గణనాథా" అన్నది ఊత పదం. రాజకీయ పార్టీల పై సెటైర్ ఇది. అయితే ఇది ఘంటసాల-బృందం పాడగా, ఎంతో క్రమ బద్ధంగా స్టెప్పులు వేస్తూ రేలంగి బృందం ఆడుతూ పాడతారు.1954 లో విడుదల అయిన చిత్రం అయినా అప్పటికి, ఇప్పటికి సదరు సగటు రాజకీయ వాతావరణంలో గాని, రాజకీయ నాయకులలో గాని ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ పాట దృశ్య (అసంపూర్ణ), శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం: పెద్దమనుషులు (1954)
ఘంటసాల: శివశివ మూర్తివి గణనాథా
వీడియోలో పాట అసంపూర్ణంగా వుంది. అయితే రేలంగి గారి స్టెప్పులు వీడియోలో చూసి తీర వలసిందే.
చిత్రం: పెద్దమనుషులు (1954)
రచన: కొసరాజు
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు
గానం: ఘంటసాల, బృందంఘంటసాల: శివశివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం: హెయ్! శివశివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
ఘంటసాల: ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం: నీవు శివుని కుమారుడవు గణనాథా
ఘంటసాల: ఓ.. ఓ..ఓ.ఓ.ఓ.ఓ.
కాంగ్రెసోళ్ళు నిను గొల్వ గణనాథా
నీవు కామితార్థమిత్తువయ్య గణనాథా
బృందం: కాంగ్రెసోళ్ళు నిను గొల్వ గణనాథా
నీవు కామితార్థమిత్తువయ్య గణనాథా
ఘంటసాల: వారి కాంక్షలన్ని తీర్తువయ్య గణనాథా
బృందం: వారి కాంక్షలన్ని తీర్తువయ్య గణనాథా
ఘంటసాల: ఓయ్! కమ్యూనిష్టులు నినుగొలువ గణనాథా
వార్ని కాపాడుచుందువయ్య గణనాథా
బృందం: కమ్యూనిష్టులు నినుగొలువ గణనాథా
వార్ని కాపాడుచుందువయ్య గణనాథా
ఘంటసాల: ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
ఆ..ఆ..ఆ.
నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం: నీవు శివుని కుమారుడవు గణనాథా
ఘంటసాల: తిక థై, తిక థై, తిక థైయకు తాథిమి
ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా
నీవు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా
బృందం: ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా
నీవు ఓడకుంటె ఒట్టుపెట్టు గణనాథా
ఘంటసాల: పదవి ఊడకుంటె ఒట్టు పెట్టు
బృందం: గణనాథా!
ఘంటసాల: ఓయ్! శివశివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
బృందం: శివశివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
ఘంటసాల: బ్లాకూ మార్కెట్టు చెయ్యి గణనాథా
నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు గణనాథా
బృందం: బ్లాకూ మార్కెట్టు చెయ్యి గణనాథా
నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు గణనాథా
ఘంటసాల: ఒక్క పెట్టకుంటె ఒట్టు పెట్టు
బృందం: గణనాథా
ఘంటసాల: నిన్ను పట్టకుంటె ఒట్టు పెట్టు
బృందం: గణనాథా
A good satire on politicians best suited for to day's politics also
రిప్లయితొలగించండిradharao
చాలా బాగుంది. ఒక్కసారి మంత్రి చేయ్, పదవి వూడకుంటే ఒట్టుపెట్టు అనేది ఈకాలానికి స్కాము చేయకుంటే ఒట్టుపెట్టు అని మార్చుకోవాలేమో.
రిప్లయితొలగించండిజంధ్యాల గౌరినాథ శాస్త్రిగారి నటన, స్పురద్రూపం పాత పోతన సినిమాలో చూశాను, ఎవరా ఈయన అనిపించింది. ఈయనపై మరిన్ని వివరాలుంటే చెప్పండి.
Happy New Year, Sir.
రాధారావు గారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిSNKR గారు, మీరు సరిగ్గ చెప్పారు స్కాముల గురించి. కాని యేం తేడాలేదు అప్పటికీ, ఇప్పటికీ.
రిప్లయితొలగించండిశ్రీ గౌరీనాథశాస్త్రిగారి గురించి ఎక్కువ తెలియదు నాకు. ఆయన భక్త పోతన లో పోతన (నాగయ్య గారు) బావయైన శ్రీనాథునిగా, 1944 లో వచ్చిన భీష్మలో భీష్మునిగా నటించారు. 1958 లో దివంగతులయ్యారు. అంతకు మించి వివరాలు నాకు తెలియవు.
మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు.