ఘంటసాల గారు నేపథ్య గాయకునిగా 1945 లో చలన చిత్ర రంగ ప్రవేశం చేసారు. వారి మొదటి పాట "స్వర్గ సీమ" చిత్రం లో భానుమతి గారితో పాడిన "ఓహో! నా రాజా". అది మొదలు ఘంటసాల తరం ప్రారంభం అయింది సినీ పరిశ్రమలో. ఈ చిత్రంలో నాయికా నాయకులు జయమ్మ (40 లలో ఈవిడ ప్రఖ్యాతి చెందిన కన్నడ నటీమణి మరియు గాయకురాలు), చిత్తూరు వి. నాగయ్య గారు. మాటలు, కొన్ని పాటలు సముద్రాల సీనియర్ గా చెప్పబడే సముద్రాల రాఘవాచార్య గారు. టైటిల్సులో S.V.R. ఆచార్య అని సూచించబడుతుంది. ఈ చిత్రానికి సంగీతం ముగ్గురు అందించారు. వారు చిత్తూరు వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు, మరియు బాలాంత్రపు రజనీకాంత రావు.
ఘంటసాల గారి ఈ తొలి గీతం యొక్క వీడియో లింకు మరియు సాహిత్యం దిగువన చూడగలరు.
వీడియో: ఘంటసాల గానామృతం నుండి
Video Courtesy: Sri Nukala Prabhakar garu
#001-01 | పాట | ఓహో నా రాజా |
---|---|---|
నిర్మాణం: | వాహినీ | |
చిత్రం: | స్వర్గసీమ (1945) | |
రచన: | సముద్రాల సీనియర్ | |
గానం: | ఘంటసాల-పి.భానుమతి | |
సంగీతం: | నాగయ్య - ఓగిరాల - బాలాంత్రపు | |
భా: | ఆ...ఆ.ఆ.ఆ. రాజా, ఓహో నా రాజా | |
అహా ..నా రాజా, రావో.. మా రాజా | ||
రావో మా రాజా, ఓహో..నా రాజా | ||
ఘం: | అరె హా..ఆ.. | |
ఏ యెన్నెల చిరునవ్వుల యిరజిమ్ము బఠాణీ (2) | ||
నీ రాకకోరి, నీ దారి కాచి ఉన్నానే (2) | ||
నీకై వేచి ఉన్నానే, పిల్లా కల్సుకున్నానే | ||
భా: | చాలులె పోరా, చాలులేరా మాయలమారీ (2) | |
నీ దారి, నీ జాడ కనగోరి, ఏకాకిగా నేజారి బేజారైతిరా | ||
ఘం: | ఓ నా చిట్టి చిలకా ఎంతలిసిపోతివే..అయ్యో. | |
భా: | అహా. | |
ఘం: | చిట్టి చిలకా ఎంతలిసిపోతివే ..పిల్లా | |
భా: | వయ్యారి బావ వగలింక చాలుగాని పోరా (2) | |
ఘం: | ఆ..నా రాణి | |
భా: | ఆ..నా రాజా | |
ఘం: | ఆ..నా రాణి | |
భా: | ఆ..నా రాజా | |
ఇద్దరు: | పాడుకుందామా జతగా ఆడుకుందామా (2) | |
ఘం: | లల్ల లల్ల లల్లల్లల లల్లలా | |
భా: | ల ల ల ల ల ల ల ల లల్లల్లల్లలలల్లలా | |
ఘం: | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ల ల్ల లల్ల లల్లాలాలల్లల్లలా | |
భా: | ల ల ల ల ల ల లల్లల్లాలా లల్ల లల్లలా | |
ఆ..ఆ..ఆ. | ||
ఘం: | తక్క ధీం తక్క ధీం | |
భా: | ఆ...ఆ... | |
ఘం: | తక్క ధీం తక్క ధీం | |
భా: | ట ట టా ట ట టా ట ట టా ట ట టా |
కృతజ్ఞతలు:
పాటల సాహిత్యం: శ్రీ సి.హెచ్.రామారావు గారు క్రోడీకరించిన "ఘంటసాల పాటశాల" నుంచి, కొద్ది మార్పులతో.
పాట చరిత్ర: వికిపిడియా http://en.wikipedia.org/wiki/Swarga_Seema
పాటల సాహిత్యం: శ్రీ సి.హెచ్.రామారావు గారు క్రోడీకరించిన "ఘంటసాల పాటశాల" నుంచి, కొద్ది మార్పులతో.
పాట చరిత్ర: వికిపిడియా http://en.wikipedia.org/wiki/Swarga_Seema
Disclaimer: The information provided is for entertainment purpose only. The author wishes to thank the sources of different web sites for the content.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి