తెలుగువారి   మంగళ 
 గళవేల్పు   ఘంటసాల 
 మాస్టారు   చలన 
 చిత్రాలలోనే   కాకుండా   ఎన్నోచలనచిత్రేతర   గీతాల 
 సంపుటముల  (Private Albums)  కోసం   చక్కని 
 శాస్త్రీయ   మరియు 
 లలిత 
 గీతాలను   స్వరపరచి   గానం 
 చేసారు .
 అందులో 
 కొన్ని 
 ఆయన 
 స్వీయ 
 రచనలు . 
 అలాంటివి   దాదాపు 
 ఎనభై 
 పైచిలుకు   పాటలున్నాయి .  అవికాక 
 మరెన్నో   అలభ్యమైన   రచనలు 
 ఉన్నాయి .  అయితే 
 ఈ 
 పాటలను ,
 వాటి 
 సాహిత్యాన్ని   విశ్లేషించి ,  అందులోని   రాగాలను ,  మాస్టారి   గానవైవిధ్యాన్ని   వివరించి   ఆ 
 సమగ్ర 
 విషయాలను   తనదైన 
 చక్కని 
 శైలిలో 
 ప్రస్తావిస్తూ   మన   ఘంటసాల   సంగీత   వైభవం   అనే 
 పుస్తక 
 రూపంలో 
 ముద్రించారు   నల్గొండ   వాస్తవ్యులు ,  విశ్రాంత   తెలుగు 
 ఉపాధ్యాయులు ,  శ్రీ 
 నాదబ్రహ్మ   సంగీత 
 కళాశాల 
 ప్రధానోధ్యాపకులు   శ్రీ 
 ఎం . పురుషోత్తమాచార్యుల 
 వారు .
 ఈ 
 పుస్తకంలో   మాస్టారు   పాడిన 
 గణేశుని   గీతాలు ,
 వేంకటేశ్వరుని   భక్తిగీతాలు ,  జయదేవుని   అష్టపదులు , అన్నమయ్య   సంకీర్తనలు ,  జిల్లెళ్ళమూడి   అమ్మపై 
 పాడిన 
 భక్తిగీతాలు ,  శాస్త్రీయ   రచనలు ,
 లలిత 
 గీతాలు ,
 జానపద 
 గీతాలు 
 యక్షగానం ,  బుఱ్ఱకథలు ,  స్వీయ 
 రచనలు ,
 సత్యసాయిబాబా   పై 
 పాడిన 
 భక్తి 
 గీతాలు ,
 ఆకాశవాణిలో   ప్రసారమయిన   మరియు 
 దేశవిదేశాలలో   మాస్టారు   ఇచ్చిన 
 కచేరీలలో   ఆలాపించిన   ప్రైవేట్   గీతాలు 
 ఇవన్నీ 
 పొందుపఱిచారు . 
డా.మహాభాష్యం చిత్తరంజన్  
సమగ్ర   సురుచిర   భాష్యం :  ఈ   సంకలనానికి   ముందుమాటగా   ప్రముఖ   లలిత   గీతాల   రచయిత ,  గాయకులు   మరియు   సంగీత   దర్శకులు   శ్రీ   డా . మహాభాష్యం   చిత్తరంజన్   ( శ్రీ   నాగరంజని   లలిత   సంగీత   అకాడమీ   అధ్యక్షులు )  గారు 
" తెలుగుజాతికే   గర్వకారణమయిన   సుమధుర   గాయక   చక్రవర్తి   శ్రీ   ఘంటసాల   వేంకటేశ్వరరావు   గారు .  మాస్టారు   గానంచేసిన   అనేకమైన   చలనచిత్రేతర   గీతాల   వివరాలను   ఈ   తరం   వారికి   అందించాలనే   సత్సంకల్పంతో   డా .  కె .  వి .  రావు   గారి   రూపకల్పనతో   సంగీత   సాహిత్య   విద్వన్మణి   శ్రీ   డా .  ఎం .  పురుషోత్తమాచార్యుల   సమతులన   విశ్లేషణతో   ఆవిర్భవించిన   బృహద్గ్రంధమిది .  నిజానికిది   ఒక   సుదీర్ఘ   పరిశొధనా   గ్రంథం "
 అని   పేర్కొన్నారు . 
శ్రీ పుట్టా మంగపతి  
చివరి   చూపు :  మాస్టారితో   అనుబంధం   కలిగిన   ఒకప్పటి   హెచ్ . ఎం . వి .  కళాకారులు ,  భాండాగార   నిర్వాహకులు   మరియు   సలహాదారులు   అయిన   శ్రీ   పుట్టా   మంగపతి   గారు   తన   స్పందనను   ఈ   విధంగా   తెలియజేసారు . " ఘంటసాల   గారితో   ఎన్నో   వైవిధ్యమైన   గీతాలను   వారి   స్వీయసంగీతంలో   పాడించి ,  ప్రైవేట్   గ్రామఫోను   రికార్డులుగా   విడుదల   చేయించిన   అదృష్టము   నాకు   దక్కిందని   గర్వపడటమే   కాకుండా   నిత్యం   సంతోషిస్తూ   ఉన్నాను .  చివరకు   భారతీయ   చరిత్రలో   శాశ్వతముగా   నిలిచిపోయే  ' భగవద్గీత ' ను   మాస్టారిచే   గానం   చేయించే   అదృష్టం   కూడా   దక్కింది .  ఆ   రికార్డింగు   తరువాత   కారులో   తిరిగివెళ్ళబోతూ   కారు   తలుపు   వేస్తూ   మాస్టారు   నన్ను   ఒక   చూపు   చూశారు .  ఆ   చూపులో   ఎన్నోభావాలు   కనిపించాయి .  బహుశా   అదే   చివరి   చూపు   కాబోలు ".   మాస్టారు   గానం   చేసిన 
" వెంకన్ననామమే   భక్తీతొ   కొలిచితే "  మరియు 
" కాలయాపనము   చేసి   తపించేవు   నరుడా "  అన్న   రెండు   భక్తి ,  తత్వరస   గుళికలు  ' రవి '  అన్న   పేరుతో   శ్రీ   మంగపతి   గారు   రచించినవే. 
శ్రీమతి ఘంటసాల సావిత్రి  
మధుర   స్మృతులు :  శ్రీ   పురుషోత్తమాచార్యుల   వారు   ఈ   గ్రంథాన్ని   మాస్టారి   శ్రీమతి   ఘంటసాల   సావిత్రమ్మ   గారికి   అంకితమిచ్చారు .   ఆవిడ 
" పురుషోత్తమాచార్యుల   వారు   ఈ   పుస్తకప్రతిని   కాకు   పంపి   నా   అభిప్రాయం   తెలియజేయమని   నాకు   పంపారు .  ఆ   ప్రతిని   చదువుతున్నప్పుడు   నా   మనస్సు   ఆ   పాత   రోజులలో   మామయ్య   ప్రతి   పాటకు ,  పద్యానికి   చేసిన   బాణీలు   గుర్తుకు   వచ్చి   ఎంతో   మధురానుభూతిని   పొందాను .  మామయ్య   బాణీలను   స్వరపరచుకొని   గానం   చేస్తూ   మధ్య   మధ్య   నా   అభిప్రాయం   అడుగుతూ   ఉండేవారు .  మా   మధ్య   జరిగిన   అప్పటి   సంభాషణలు   పదే   పదే   గుర్తుకు   వచ్చి   మనసు   పులకరించింది .  చారిత్రాత్మకమైన   ఈ   పరిశోధనా   గంథాన్ని   చక్కని   సంగీత ,  సాహిత్య   విశ్లేషణతో   రచించిన   శ్రీ   పురుషోత్తమాచార్యుల   వారికి ,  వారి   కుటుంబ   సభ్యులకు   ఆయురారోగ్య ,  అష్టైశ్వర్యములు   ప్రసాదించాలని   ఆ   భగవంతుని   మనసారా   వేడుకుంటున్నాను "  అని   తన   స్పందన   తెలియజేసారు . 
డా. శారద, డా. కె.వి.రావు  
తీరిన   కోరికలు :  ఈ   గ్రంథం   ఒక   చక్కని   రూపాన్ని   ధరించడానికి   పునాది   హైదరాబాదు   వాస్తవ్యులు   మరియు   ప్రముఖ   ఘంటసాల   ఆరాధకులు   శ్రీ   డా .   కె . వి . రావు   గారు ,  వారి   సతీమణి   డా .  శారద   గార్ల   సత్సంకల్పం .   వారికున్న   రెండు   కోరికలలో   మాస్టారి   ప్రైవేట్   గీతాలకు ,  పద్యాలకు   కూచిపూడి   నృత్యరూపకంగా   ప్రదర్శింపబడటం   కొన్ని   సంవత్సరాలక్రితం   పిన్నవయసులోనే  ' బాలశ్రీ '  పురస్కారం   పొందిన   కుమారి   లలితా   సింధూరి   ద్వారా   జరిగింది .  తరువాతి   కోరిక   వారి   ఆప్తమిత్రులు   శ్రీ   పురుషోత్తమాచార్యుల   వారి   ద్వారా 
" మన   ఘంటసాల   సంగీత   వైభవం "  పుస్తకం   ద్వారా   ఈడేరింది . " ఘంటసాల   గారు   గానం   చేసిన   గీతాలు   ఈనాటికీ   చెక్కుచెదరకుండా   ఉండటానికి   కారణము   వారు   తన   మనోనేత్రముతో   కవిహృదయంలో   జొరబడి   వారి   భావాలను   గ్రహించి   గానం   చేయగల   అద్వితీయ   ప్రతిభయే " నని   డా .  కె . వి .  రావు   గారి   అభిప్రాయం .  
రచయిత పరిచయం 
డా.ఎం.పురుషోత్తమాచార్య  
శ్రీ   ఎం . పురుషోత్తమాచార్య 
 గారు 
1948  లో 
 నల్గొండ   జిల్లా 
 హుజూర్ 
 నగర్ 
 లో 
 శ్రీమతి   మంగతాయమ్మ   మరియు 
 శ్రీ 
 వేంకట 
 నరసింహాచార్య   పుణ్యదంపతులకు   జన్మించారు .   శ్రీ   పురుషోత్తమాచార్యుల   వారు 
 ఎన్నో 
 రేడియో 
 నాటక 
 రచనలు ,
 పద్యనాటకాలు ,  వ్యాసాలు   వ్రాసారు .  సునాదయోగి   త్యాగయ్య   చరిత్రను   హరికథగా   వ్రాసారు .  అలాగే 
 వారికి 
1998  లో 
 ఘంటసాల 
 కమెండేషన్  ( మచిలీపట్నం ), 2008  లో   ద్వారకానాధ   శాస్త్రి   పరిశోధక   పురస్కారం , 2011  లో   వరూధిని  -  ఉత్తమ 
 నాటక 
 రచయిత 
 గా 
 నంది 
 నాటక 
 పురస్కారం   లభించాయి .  ఈ 
 గ్రంథంలో   పొందుపరచిన   గీతాలను   శ్రీ 
 పురుషోత్తమాచార్యుల   వారు 
 వస్తురీత్యా   విభజన 
 చేసి ,
 గీతాలను   విని 
 వ్రాతప్రతిని   తయారుచేసుకుని ,  తదుపరి 
 సాహిత్యపరంగా   భావం ,
 అర్థాలు ,  విశేషాలు   వివరిస్తూ ,  స్వరకల్పన ,  గాయన 
 విధానం ,
 సాహిత్యంతో   అనుసంధానం ,  నేపథ్య 
 సంగీతం ,
 వాద్యసంగీత   ధోరణి 
 మరియు 
 వాద్యవాదనావైభవం   అనే 
 అంశాలను   తీసుకుని   సునిశితంగా   విశ్లేషించారు .   మాస్టారు పాడిన పాటల వర్గీకరణ ఈ విధంగా వుంది:                                   
  * భక్తి
  గీతాలు * బుఱ్ఱ
  కథలు  
  * శాస్త్రీయ
  రచనలు  * స్వీయరచనలు
  - రికార్డైనవి   
  * దేశభక్తి
  గేయాలు * స్వీయరచనలు
  - రికార్డు కానివి   
  * జానపద
  గేయాలు * పాడించిన
  బాణీలు   
  * లలిత
  గీతాలు  * ఆకాశవాణి
  సేవలు  
 
 ఈ 
 రచన 
 చేయడం 
 తమ 
" అపూర్వసుకృతం "  అని   రచయిత 
 స్పందన . అంతేకాక మాస్టారు పాడిన                    ప్రైవేట్ పద్యాల కోసం ప్రత్యేకించి శ్రీ పురుషోత్తమాచార్యుల వారు                     మరొక గ్రంథ రచన చేస్తున్నారు  . దానిని త్వరలోనే ప్రచురిస్తామని వారు తెలిపారు             .                                                             
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 
VIDEO 
" మన   ఘంటసాల   సంగీతవైభవం "  ప్రతులకు   శ్రీ 
 కె . వి .  రావు   గారిని 
 సంప్రదించండి .  
శ్రీ   కె . వి .  రావు   గారి   చిరునామా :  
28, 4  వ   అంతస్తు ,  
ఇం . నెం . 1-1-79,  భాగ్యనగర్   అపార్ట్   మెంట్స్ ,  
ఆర్ . టి . సి .  క్రాస్ 
 రోడ్స్ ,
 శ్రీ 
 మయూరి 
 సినిమా 
 ప్రక్కన ,  
హైదరాబాదు  - 500 020.  
సెల్ 
 నంబరు :
98487 42320. 
త్వరలో 
 శ్రీ 
 పురుషోత్తమాచార్య   గారు 
 విశ్లేషించిన   మాస్టారి   చలనచిత్రేతర   గీతాలను   వారి 
 సౌజన్యంతో   మన 
" ఘంటసాల "
 బ్లాగులో   ప్రచురిస్తాము   అని 
 తెలియజేయుటకు   నాకెంతో   సంతోషంగా   వుంది . అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు                         
భవదీయుడు   
సూర్యనారాయణ   వులిమిరి ,  నార్త్ 
 కరోలినా ,  అ . సం . రా .