జానపద చిత్రాలనగానే రాజుల కథలు, మాంత్రికులు, వారి మాయలు మొదలయినవన్నీ రంగరించి చక్కని కథా చిత్రాలుగా వెలువడ్డాయి. పిల్లల కథల పత్రికయిన చందమామ లో ఇలాంటి కథలు, ముఖ్యంగా పేదరాశి పెద్దమ్మ కథలు ఎన్నో చదువుతుంటాం. ఆ ఇతివృత్తం తో అలనాటి చలన చిత్ర ప్రముఖ గిడుతూరి సూర్యం దర్సకత్వం లో కాంతారావు, కృష్ణకుమారి జంటగా వచ్చిన చిత్రమే పేదరాశి పెద్దమ్మ కథ (1968). చిత్రసీమలో సుపరిచితురాలైన నిర్మలమ్మ టైటిల్ పాత్ర ధరించిన ఈ చితంలో ఘంటసాల, సుశీల పాడిన చక్కని ఆరుద్ర యుగళగీతం ఇదియే అందాల మానవ సీమ. సంగీత దర్సకత్వం మన బాలుకు గురు తుల్యులైన ఎస్.పి. కోదండపాణి.
Thanks to Tollywood for loading the video to You Tube
| చిత్రం: | పేదరాశి పెద్దమ్మ కథ (1968) | ||
| రచన: | ఆరుద్ర | ||
| సంగీతం: | ఎస్.పి.కోదండపాణి | ||
| గానం: | ఘంటసాల, పి.సుశీల |
| పల్లవి: | ఘంటసాల: | ఇదియే అందాల మానవ సీమా ఆ..ఆ.. | |
| ఇలయే ప్రేమికుల మురిపాల సీమ | |||
| సుశీల: | ఇదియే లావణ్య జీవన మహిమ ..ఆ..ఆ.. | ||
| ఇచటే పండునులే ఎనలేని ప్రేమా.. | |||
| ఇదియే లావణ్య జీవన మహిమా ..ఆ..ఆ.. | |||
| చరణం: | ఘంటసాల: | విరిసే సొగసులతో.. నిదురించే సెలయేరూ | |
| సెలయేటి తిన్నెలపై పులకించే హృదయాలు | | విరిసే | | ||
| సుశీల: | శిలలైనా వలపులతో చిగురించే కోన | | శిలలైనా | | |
| కమనీయం, రమణీయం, కమ్మని జీవనా | | కమనీయం | | ||
| ఘంటసాల: | ఇదియే అందాల మానవ సీమ ఆ.. | ||
| సుశీల: | ఆ..ఆ..ఇచటే పండునులే ఎనలేని ప్రేమా..ఆ.. | ||
| ఇదియే లావణ్య జీవన మహిమ ..ఆ..ఆ.. | |||
| చరణం: | సుశీల: | ఆశలు హంసలై విహరించే దీవీ.. | |
| అలలాగా పడిలేచే అందాల తనివి | | ఆశలు | | ||
| ఘంటసాల: | పైరగాలి కెరటాల పయనించే గీతం | | పైరగాలి | | |
| ఎదవుంటే భూలోకం ఎంతో మోహనం | | ఎదవుంటే | | ||
| ఘంటసాల: | ఇదియే అందాల మానవ సీమ ఆ.. | ||
| సుశీల: | ఆ..ఆ..ఇచటే పండునులే ఎనలేని ప్రేమ.. | ||
| ఇద్దరు: | ఇదియే అందాల మానవ సీమ ఆ..ఆ.. |


చాలా హాయిగా ఉంది
రిప్లయితొలగించండి