జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులు. వారిలో మొదటి స్థానం తల్లిది. తరువాత వచ్చేది తండ్రిది. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే విషయంలో తండ్రి కూడ కీలకమైన పాత్ర వహిస్తాడు. అందులో తల్లిలేని పిల్లల్ను పెంచడంలో తండ్రి బాద్యత మరింత పెరుగుతుంది. ఈ ఇతివృత్తంతో పిల్లలకు తానే తల్లీ తండ్రీ అయి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి వారినుండి అభిమానాన్ని తప్ప మరేమీ ఆశించని పాత్రలోను, ఒక కొడుకు పాత్రలోను, ద్విపాత్రాభినయం చేసిన అక్కినేని నటనా కౌశలానికి మరొక నిదర్శనం రవీంద్ర ఆర్టు ఫిలింస్ పతాకం పై 1970లో నిర్మించబడిన ధర్మదాత చిత్రం. గతస్మృతులను నెమరువేసుకుంటూ ఈ పాట ఫాదర్స్ డే సందర్భంగా మీకు అందిస్తున్నాను.ఈ పాట వ్రాసినది సి.నారాయణ రెడ్డి, సంగీతం టి.చలపతి రావు, పాడినది ఘంటసాల, పి.సుశీల మరియు జయదేవ్.
చిత్రం: | ధర్మదాత (1970) | ||
రచన: | సి.నారాయన రెడ్డి | ||
సంగీతం: | టి.చలపతి రావు | ||
గానం: | ఘంటసాల, ఫి.సుశీల, జయదేవ్ | ||
సాకీ: | ఘంటసాల: | ఓ! నాన్నా! ఓ...నాన్నా! | |
పల్లవి: | ఓ! నాన్నా, నీ మనసే వెన్నా | ||
అమృతము కన్నా, అది యింతో మిన్నా | |||
ఓ! నాన్నా, ఓ! నాన్నా | |||
చరణం: | ఘంటసాల: | ముళ్ళబాటలో నీవు నడిచావు | |
పూల తోటలో మమ్ము నడిపావు | |||
అందరు: | ముళ్ళబాటలో నీవు నడిచావు | ||
పూల తోటలో మమ్ము నడిపావు | |||
ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో | |||
ఘంటసాల: | పరమాన్నం మాకు దాచి వుంచావు | ||
అందరు: | ఓ! నాన్నా, నీ మనసే వెన్నా | ||
అమృతము కన్నా, అది యింతో మిన్నా | |||
ఓ! నాన్నా, ఓ! నాన్నా | |||
చరణం: | సుశీల: | పుట్టింది అమ్మ కడుపులోనైనా | | పుట్టింది | |
పాలు పట్టింది నీ చేతిలోన | |||
ఊగింది ఉయ్యాలలోనైనా | | ఊగింది | | ||
నేను దాగింది నీ చల్లని ఒడిలోన | |||
చల్లని ఒడిలోన | |||
అందరు: | ఓ! నాన్నా, నీ మనసే వెన్నా | ||
అమృతము కన్నా, అది యింతో మిన్నా | |||
ఓ! నాన్నా, ఓ! నాన్నా | |||
చరణం: | జయదేవ్: | ఉన్ననాడు ఏమి దాచుకున్నావు | |
లెనినాడి చేయి చాచనన్నావు | |||
అందరు: | ఉన్ననాడు ఏమి దాచుకున్నావు | ||
లెనినాడి చేయి చాచనన్నావు | |||
నీ రాచ గుణమే మా మూలధనము | |||
నీవే మా పాలి దైవము | |||
ఓ! నాన్నా, నీ మనసే వెన్నా | |||
అమృతము కన్నా, అది యింతో మిన్నా | |||
ఓ! నాన్నా, ఓ! నాన్నా | |||
Thanks to DivyaMedia for providing the Video Clip and to You Tube for hosting the clip.